లేత దొంగ! సార్‌..  ఇదే మొదటి  దొంగతనం!

Being Necessary For Family Accused Of Sealing - Sakshi

ఖమ్మం అర్బన్‌: ఓ సినిమాలో ఆలీ లేత దొంగగా కనిపించి నవ్వించాడు. ఎప్పటికప్పుడు ఇదే ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ దొంగతనం అనుకుని చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతుంటాడు. సరిగ్గా ఇదే రీతిన ఖమ్మంలో ఓ యువ­కుడు చోరీ చేసి పట్టుబడ్డాడు. ఖమ్మం ఖానాపురం సెంటర్‌లోని తూము మోహన్‌రావు కిరాణం షాపు షట్టర్లను గతనెల 25న పగులగొట్టి సెల్‌ఫోన్, వెండిపట్టీలు, రూ.15 వేలు చోరీ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణలో భాగంగా ఖమ్మం మంచికంటి నగర్‌కు చెందిన దేవెళ్ల మహేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

విచార­ణ­లో నేరం ఒప్పుకున్న అతను చోరీ చేసేందుకు గల కారణాలను వివరించాడు. తల్లిదండ్రులతో ఘర్షణ పడి వేరు కాపురం పెట్టానని, దీంతో అవసరమైన సరుకులు కొనుగోలు చేసేందుకు మొదటిసారి దొంగతనం చేశానని చెప్పాడు. చోరీ చేసిన నగదుతో గ్యాస్‌ సిలిండర్, వంటపాత్రలు కొనుగోలు చేసి సెల్‌ఫోన్, పట్టీలు ఇంట్లోనే ఉంచినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో ఆయా సరుకులను రికవరీ చేసిన ఖమ్మం అర్బన్‌ పోలీసులు మహేష్‌ను సోమ­వారం కోర్టులో హాజరుపరిచారు. 

(చదవండి: గద్వాలలో ‘డర్టీ పిక్చర్‌’!)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top