సర్కార్‌ వైఫల్యాలను ఎండగడతాం

Bandi Sanjay Maha Padayatra To Bring The BJP In Power - Sakshi

బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే పాదయాత్ర లక్ష్యం: బండి సంజయ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 24 నుంచి తాను చేపట్టనున్న పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో పెనుమార్పులు రాబోతున్నాయని బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. ఈ యా త్రతో తెలంగాణలో బీజేపీ చరిత్ర సృష్టించనుందని చెప్పారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం,  బీజేపీని అధికా రంలోకి తీసుకురావడమే తన పాదయాత్ర ముఖ్య ఉద్దేశమని ప్రకటించారు. శనివారం బీజేపీ నగర కార్యాలయంలో పాద యాత్ర సన్నాహాలపై జరిగిన సమావేశంలో బండి సంజయ్‌ మాట్లాడుతూ.. పార్టీ జాతీయ నాయకత్వం, కేంద్ర మంత్రులు పాదయాత్రకు సంఘీభావం తెలు పుతారని అన్నారు. పాదయాత్రలో పాల్గొనేందుకు ఒక్కో జిల్లా నుంచి 20 మందికి అవకాశమిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించే వరకు పోరాడతామన్నారు. పాదయాత్ర ఏర్పాట్లు, దీనిలో వివిధ అంశాలు, రంగాలకు సంబంధించిన పనుల సమన్వయం కోసం 28 కమిటీలను ఏర్పాటు చేశారు. యాత్రా ప్రముఖ్‌గా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.జి. మనోహర్‌రెడ్డిని నియమించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top