
ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పోర్టల్‌లోకి కొత్తవారి పేర్లు
ప్రస్తుతం పోర్టల్‌లో 2.81 కోట్ల మంది అటాచ్
కొత్తగా సుమారు 30 లక్షల మంది వివరాలు
2023 నుంచి 10.72 లక్షల మందికి ఆరోగ్యశ్రీ సేవలు
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
సాక్షి, హైదరాబాద్: కొత్త రేషన్‌కార్డులు పొందిన వారందరికీ ఆరోగ్యశ్రీ సదుపాయం కల్పించేందుకు వైద్య,ఆరోగ్య శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా రేషన్ కార్డుల్లో పేరున్న వ్యక్తులందరికీ ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి రాష్ట్రంలో 89,95,282 రేషన్‌కార్డులు ఉండగా, వాటిలో సభ్యులుగా 2.81 కోట్ల మంది ఉన్నారు. వీరందరు ఆరోగ్యశ్రీ పోర్టల్‌తో అనుసంధానమై ఉన్నారు. వీరికి ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో నిబంధనల మేరకు చికిత్సలకు అవకాశం ఉంటుంది.
కొత్తగా 30 లక్షల మంది
జనవరి 26 నుంచి రాష్ట్రంలో కొత్తగా రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ మొదలైంది. కొత్తగా సుమారు 6 లక్ష లకు పైగా రేషన్‌కార్డులు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కార్డుల సంఖ్య 95,56,625కు పెరిగింది. వీటిల్లో 3.10 కోట్ల మంది లబి్ధదారులుగా నమోదయ్యారు. కొత్తగా కార్డుల్లో చేరిన 30 లక్షల మంది వివరాలు ఆరోగ్యశ్రీ పోర్టల్‌లోకి ఎక్కి స్తున్నారు. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో కొత్త కార్డుదారుల వివరాలను కూడా ఆరోగ్యశ్రీ పోర్టల్‌లో ఎక్కించాలని ఆదేశించటంతో అధికారులు ఆ మేరకు చర్యలు చేపట్టారు.
2023 నుంచి 10.72 లక్షల మందికి ఆరోగ్యశ్రీ సేవలు: మంత్రి దామోదర
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన డిసెంబర్, 2023 నుంచి ఇప్పటివరకు 10.72 లక్షల మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందించినట్లు మంత్రి దామోదర తెలిపారు. వైద్య సేవల బిల్లుల కింద ప్రభుత్వం నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.1,590 కోట్లకుపైగా చెల్లించింది.
సగటున 22 శాతం మేర చికి త్స చార్జీలు పెరగడంతోపాటు ప్రతి నెలా ఆస్పత్రు లకు బిల్లుల కింద రూ.100 కోట్ల వర కు చెల్లిస్తుండడంతో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో చేరేందుకు ప్రైవేటు ఆస్పత్రులు ఆసక్తి చూపిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం 461 ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవ లు అందుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నిరకాల మందులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.