
సాక్షి, హైదరాబాద్: టీజీఎస్ ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల నియామకానికి బుధవారం (అక్టోబర్ 8 ) ఉదయం 8 గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు.
ఆన్‌లైన్ దరఖాస్తుతోపాటు ఎస్సీ కమ్యూనిటీ అభ్యర్థులు తమ కమ్యూనిటీ సర్టిఫికెట్లను కొత్త నిర్దేశిత ఫార్మాట్‌లో (నిర్దిష్ట గ్రూప్ అంటే గ్రూప్– ఐ /గ్రూప్– ఐఐ / గ్రూప్– ఐఐఐ యొక్క ఉప–వర్గీకరణతో) ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు అప్‌లోడ్ చేయాలని సూచించారు. అభ్యర్థులు సకాలంలో కొత్త సర్టిఫికెట్‌ను పొందలేకపోతే, వారి వద్ద ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేయవచ్చని సూచించారు.
అయితే, ఆయా అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో కొత్త ప్రొఫార్మాలో కమ్యూనిటీ సర్టిఫికెట్‌ను సమర్పించాలని స్పష్టం చేశారు. అలా చేయకపోతే ఎస్సీ కేటగిరీ కింద పరిగణించబోమని వెల్లడించారు. కాగా, టీజీఎస్ ఆర్టీసీలోని మొత్తం వెయ్యి డ్రైవర్ పోస్టులకు, 743 శ్రామిక్ పోస్టుల భర్తీకి టీఎస్‌ఎల్పీఆర్బీ సెప్టెంబర్ 17న నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇందులో డ్రైవర్‌పోస్టుకు పేస్కేల్ రూ.20,960 నుంచి రూ.60,080 కాగా, శ్రామిక్ పోస్టులకు రూ.16,550 నుంచి రూ. 45,030గా ఉన్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు వివరాల కోసం టీఎస్‌ఎల్పీఆర్బీ వెబ్‌సైట్‌లో ఠీఠీఠీ.్టజpటb. జీnలో చూడాలని శ్రీనివాసరావు పేర్కొన్నారు.