Telangana Government Decided to Distribute COVID Booster Doses - Sakshi
Sakshi News home page

కరోనా కేసుల్లో పెరుగుదల.. రేపటి నుంచి తెలంగాణలో కోవిడ్‌ బూస్టర్‌ డోసులు

Apr 18 2023 9:18 PM | Updated on Apr 18 2023 9:31 PM

Amid Corona Cases Raises Covid booster doses in Telangana Starts - Sakshi

మొదటి రెండు డోసులు కోవాగ్జిన్‌ లేదా కోవీషీల్డ్ తీసుకున్నా సరే.. బూస్టర్‌ డోస్‌గా.. 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రేపటి(బుధవారం) నుంచి కోవిడ్‌ బూస్టర్‌ డోసుల పంపిణీ ప్రారంభించనుంది ప్రభుత్వం. కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా వెళ్లిన వారికి ముందు వ్యాక్సిన్ ఇచ్చేలా వైద్య సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ మేరకు ఐదు లక్షల కార్బోవ్యాక్స్‌ డోసుల్ని సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో అందుబాటులో ఈ బూస్టర్‌ డోసుల్ని ఉంచనుంది. తాజాగా మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్ నగరంలో గత వారం రోజులుగా కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో ముందు జాగ్రత్త చర్యలు మొదలు పెట్టింది. హైదరాబాద్‌లో తాజాగా 21 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని, మాస్క్‌లు ధరించి తగు జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచించింది.

మొదటి రెండు డోసులు కోవాగ్జిన్‌ లేదా కోవీషీల్డ్ తీసుకున్నా.. బూస్టర్ డోసుగా కార్బెవ్యాక్స్‌ను తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని.. అందరికీ మూడో బూస్టర్ డోసు అందుతుందని అధికారులు అంటున్నారు. రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియ సమాంతరంగా జరుగుతుందని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement