అమీర్‌పేట ప్రమాదం.. స్పాట్‌కు ‘హైడ్రా’ రంగనాథ్‌ | Ameerpet Mytrivanam Fire Accident: HYDRAA Ranganath Visit Spot | Sakshi
Sakshi News home page

అమీర్‌పేట ప్రమాదం.. స్పాట్‌కు ‘హైడ్రా’ రంగనాథ్‌

Jun 5 2026 1:37 PM | Updated on Jun 5 2026 1:54 PM

Ameerpet Mytrivanam Fire Accident: HYDRAA Ranganath Visit Spot

హైదరాబాద్‌: అమీర్‌పేట మైత్రివనం సిగ్నల్‌ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇంత భారీ ప్రమాదం జరిగి 24 గంటలు గడుస్తున్నా.. ఎలా జరిగింది? అనేదానిపై పోలీసులు కచ్చితమైన ఓ అంచనాకు రాలేకపోయారు. ఈ క్రమంలో.. ఫోరెన్సిక్‌ టీం శుక్రవారం మరోసారి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేసింది. మరోవైపు.. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. 

‘‘మంటల్లో బిల్డింగ్‌ దాదాపుగా కాలిపోయింది. కాంప్లెక్స్‌కు ఎంట్రీ, ఎగ్జిట్‌లు సరిగ్గా లేవు. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగలేదు. పక్కన మెస్‌ నుంచి మంటలు వ్యాపించాయని కొందరు అంటున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే జరిగిందని మరికొందరు అంటున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనేది దర్యాప్తు పూర్తైతేనే తెలుస్తుంది.. 

.. మెట్రో నిర్మాణం తర్వాతే ఈ కాంప్లెక్స్‌ కట్టారని అంటున్నారు. ఫుట్‌పాత్‌, నాలా ఆక్రమణలు జరిగాయా? అనే దానిపై దృష్టిసారించాం. అలాగే.. బిల్డింగ్‌ అనుమతలు, ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు పాటించారా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. నాలా ఆక్రమణ ఉంటే కచ్చితంగా కూల్చేస్తామని అన్నారాయన. ఈ ప్రమాదం నేపథ్యంలో.. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని భవనాలపై హైడ్రా తరఫున ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారాయన. 

ఇదిలా ఉంటే.. మైత్రివనం చౌరస్తాలోని మెట్రో పిల్లర్‌ నెంబర్‌ 1043 వద్ద శ్రీనివాసనగర్ వెస్ట్ కమాన్‌ను ఆనుకుని ఉన్న కేఎస్సార్‌ మాల్‌ కాంప్లెక్స్‌లో గురువారం మధ్యాహ్నాం అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం ధాటికి 20కి పైగా దుకాణాలు ఖాళీ బూడిదయ్యాయి. సుమారు కోటిన్నర రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. అయితే రెండో అంతస్తులో షార్ట్‌సర్క్యూట్ జరిగి ఈ ఘోరం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement