Hyderabad: నుమాయిష్‌కు అంతా రెడీ.. ఎంట్రీ ఫీజు ఎంతంటే!

All Set For Hyderabad Nampally Exhibition Numaish 2023 Details Inside - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జనవరి 1వ తేదీ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో 83వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయి‹Ù) ప్రారంభమవుతుందని ఎగ్జిబిషన్‌ సొసైటీ ఉపాధ్యక్షులు అశ్విని మార్గం తెలిపారు. శుక్రవారం ఎగ్జిబిషన్‌ మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా కోవిడ్‌ నేపథ్యంలో నుమాయిష్‌లోలో వ్యాపారాలు సరిగా జరగలేదని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నుమాయిష్‌ ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

ఈ ఏడాది కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అన్నిరకాల ఉత్పత్తులతో కూడిన స్టాల్స్‌ అందుబాటులో ఉంటాయని తెలిపారు. విశాలమైన మైదానంలో స్టాల్స్‌కు మధ్య దూరం కల్పిస్తూ సుమారు 2400 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎగ్జిబిషన్‌ ప్రదర్శనకు వచ్చే సందర్శకులకు ఉచిత పార్కింగ్, వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు కోవిడ్‌ భద్రతా ఏర్పాట్లను చేపట్టినట్లు తెలిపారు.

ఈ నెల 1వ తేదీన రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డిలు ముఖ్య అతిథిగా హాజరై ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ ఏడాది ప్రవేశ రుసుము రూ.40 అని, అదేవిధంగా పిల్లలు, పెద్దల కోసం అద్భుతమైన అమ్యూజ్‌మెంట్‌ పార్కును సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎగ్జిబిషన్‌ సొసైటీ కార్యదర్శి సాయినాథ్, దయాకర్‌ శాస్త్రి, జాయింట్‌ సెక్రెటరీ వనం సురేందర్, పబ్లిసిటీ చైర్మన్‌ హరినాథ్‌రెడ్డి, కనీ్వనర్‌ ఆదిత్య మార్గం తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top