
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈనెల 14న తెలంగాణకు రానున్నారు. మంచిర్యాలలో చేపట్టబోయే నిరసన దీక్షలో ఖర్గే పాల్గొననున్నారు. ఈ నిరసన దీక్షలో ఏఐసీసీ చీఫ్‌తోపాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క ఇతర ముఖ్యనేతలు పాల్గొననున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా టీకాంగ్రెస్ నిరసన దీక్ష చేపట్టనుంది.
కాగా రాహుల్‌పై అనర్హత వేటుకు నిరసనగా దేశంలోని ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు వ్యూహత్మక ప్రయత్నాలు చేస్తున్నారు ఖర్గే. అదానీ వ్యవహారంపై పార్లమెంటు లోపలా, బయటా సమర్థవంతంగా పోరాడుతున్నారు. ఇక ఖర్గే సొంత రాష్ణమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్‌కు అగ్ని పరీక్షగా మారాయి.
రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని ఇటీవలి కొన్ని సర్వేలు తేల్చి చెప్పడంతో కాంగ్రెస్ జాతీయ నేతల్లో ఉత్సాహం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రతిష్ఠ పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
చదవండి: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు