Adivasi Girl: కెమెరామెన్‌గా రాణిస్తున్న ఆదివాసీ యువతి | Adivasi Girl Mamata Doing Photography Work At Komaram District | Sakshi
Sakshi News home page

Adivasi Girl: కెమెరామెన్‌గా రాణిస్తున్న ఆదివాసీ యువతి

Nov 11 2021 10:42 AM | Updated on Nov 11 2021 4:03 PM

Adivasi Girl Mamata Doing Photography Work At Komaram District - Sakshi

సాక్షి, కుమురం భీం: ఫోటోగ్రఫీ అంటే మగవాళ్ల సామ్రాజ్యం!ఎక్కువగా పురుషులే ఈ రంగంలో ఉంటారు. అయితే మగవాళ్లకు తానేం తక్కువ కానంటుంది ఓ ఆదివాసి యువతి. ఫోటోగ్రఫీలో రాణిస్తూ శభాష్‌ అనిపించుకుంటుంది. అద్బుతమైన ఫోటోలు తీస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. కుమురం భీం జిల్లా జైనూర్‌ మండల కేంద్రానికి చెందిన ఆత్రం మాధవరావు ముగ్గురు కుమార్తెల్లో చివరి అమ్మాయి మమత.

ఆమె సిర్పూర్‌ యూ మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ చదువుతోంది. అయితే ఆమె చదువకుంటునే ఫోటోగ్రఫర్‌, వీడియో గ్రాఫర్‌గా రాణిస్తోంది. రోడ్లు కూడా సరిగాలేని మారుమూల గ్రామాలకు వెళ్లి ఫోటోలు తీస్తోంది మమత. ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు సైజ్‌ ఫోటోలు, ఇతర శుభకార్యలకు కూడా ఆమె ఫోటోలు తీస్తోంది. తనకు చదువుకుంటూ ఫోటోలు తీయటం సంతోషంగా ఉందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement