ఉట్నూర్‌ ఐటీడీఏకి ‘తుడుందెబ్బ’ | Sakshi
Sakshi News home page

ఉట్నూర్‌ ఐటీడీఏకి ‘తుడుందెబ్బ’

Published Tue, Feb 21 2023 2:14 AM

Adilabad: Tension Prevails In Utnoor As Tribals Lay Siege To ITDA Office - Sakshi

సాక్షి,ఆదిలాబాద్‌: ఎస్టీల్లో నుంచి లంబాడాలను తొలగించాలని ఇప్పటివరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించిన ఆదివాసీలు తాజా­గా ప్రభుత్వం వివిధ కులాలను ఎస్టీల్లో చేర్చడంపై ఆగ్రహావేశాలతో ఆందోళన ఉధృతం చేశారు. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో వాల్మీకిబోయ, ఖైతి లంబాడాతో పాటు మొత్తంగా 11 కులా­­లను షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ) జాబితా­లో చేరుస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ ఐటీడీఏను ముట్టడించాలని ఆదివాసీ హ­క్కు­ల పోరాట సమితి (తుడుందెబ్బ) ముందుగా నిర్ణయించింది. రాష్ట్ర అధ్యక్షుడు బుర్సా పోచయ్య ఆధ్వర్యంలో సోమవారం ఆదివాసీలు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉట్నూర్‌ ఐటీడీఏ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఆ తర్వాత కార్యాల­యంలోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించ­గా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు­వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. సమీపంలో ఏర్పాటుచేసిన బారికేడ్లను తోసేసి ఆదివాసీలులోనికి దూసుకెళ్లారు. కా­ర్యాలయం పైకి ఆందోళనకారులు రాళ్లు రు­వ్వారు. దీంతో కిటికీ అద్దాలు ధ్వంసం అ­య్యా­యి. ఆవరణలో ఉన్న ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్‌ వాహన అద్దాలను ధ్వంసం చేశారు. 

అదనపు బలగాలతో చేరుకున్న ఎస్పీ 
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్పీ డి.ఉదయ్‌కుమార్‌ రెడ్డి అదనపు బలగాలతో ఉ­ట్నూర్‌ చేరుకున్నారు. సమస్యలను కలెక్టర్‌కు విన్నవించాలని కోరా­రు. అయితే ఆందోళనకారులు ఐటీడీఏ పీవో రావాలని పట్టుబట్టారు. ప్రస్తుతం నిర్మల్‌ కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న వరు­ణ్‌­రెడ్డి ఉట్నూర్‌ ఐటీడీఏకు ఇన్‌చార్జి పీవోగా కొనసాగుతున్నా­రు.

ఓ గంట తర్వాత ఆయ­న అక్కడికి చేరు­కోవడంతో ఆదివాసీ­లు తమ సమస్యలను విన్నవించారు. ఎస్టీ­ల్లో అదనంగా కు­లా­­లను చేర్చడాన్ని వెన­క్కి తీసు­కోవాలని డి మాం­డ్‌ చేశారు. పోడు భూ­ములకు పట్టాల జారీ­లో షరతు­లు విదించడం సరికాదన్నారు. దీనిపై వినతి పత్రాన్ని అందజేశారు. ఆయన స్పందిస్తూ ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement