ఏసీబీ కోర్టులో రేవంత్‌రెడ్డికి చుక్కెదురు | ACB Court Dismisses Revanth Reddy Petition | Sakshi
Sakshi News home page

ఏసీబీ కోర్టులో రేవంత్‌రెడ్డికి చుక్కెదురు

Jan 29 2021 1:39 PM | Updated on Jan 29 2021 4:19 PM

ACB Court Dismisses Revanth Reddy Petition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏసీబీ కోర్టులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు కోట్లు కేసు ఏసీబీ పరిధిలోకి రాదన్న రేవంత్ పిటిషన్‌ను  కోర్టు కొట్టివేసింది. ఓటుకు కోట్లు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందన్న కోర్టు.. ఇప్పటికే మరో ముగ్గురు నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టేవేసింది. గతంలో హైకోర్టు.. సండ్ర, ఉదయసింహా, సెబాస్టియన్‌ పిటిషన్లను కొట్టివేయగా, ఇప్పుడు రేవంత్‌రెడ్డి పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. చదవండి: పార్టీ మారడం లేదు: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ

ఓటుకు కోట్లుకు సంబంధించి అన్ని ఆధారాలున్న ఉన్నాయని ఏసీబీ తెలిపింది. ఆడియో, వీడియో టేపులతో సహా అన్ని ఆధారాలున్నాయని పేర్కొంది. రూ.50లక్షలు ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా నిందితులు పట్టుబడ్డారని ఏసీబీ తెలిపింది. ఏసీబీ వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. అభియోగాల నమోదు కోసం విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. ఫిబ్రవరి 8న నిందితులు హాజరుకావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. చదవండి: బీజేపీ, టీఆర్‌ఎస్‌పై ఉత్తమ్‌ ధ్వజం

Advertisement
 
Advertisement
Advertisement