పార్టీ మారడం లేదు: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ | TRS MLC Tera Chinnapa Reddy Clarity Over Join BJP Rumours | Sakshi
Sakshi News home page

పార్టీ మారడం లేదు : చిన్నపరెడ్డి

Jan 29 2021 8:05 AM | Updated on Jan 29 2021 10:03 AM

TRS MLC Tera Chinnapa Reddy Clarity Over Join BJP Rumours - Sakshi

తనతో బీజేపీ నేతలు సంప్రదిస్తున్నారని వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు.

సాక్షి, హైదరాబాద్‌: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి స్పష్టం చేశారు. తనతో బీజేపీ నేతలు సంప్రదిస్తున్నారని వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. పార్టీ అధినేత కేసీఆర్‌కు, పార్టీకి ఎప్పుడూ విధేయుడిగానే ఉంటానన్నారు. తాను కూడా ఎవరితోనూ సంప్రదింపులు జరపడం లేదని చిన్నపరెడ్డి పేర్కొన్నారు. (చదవండి: పెద్దపల్లి జిల్లా బీజేపీలో ముసలం)

కేసీఆర్‌ కేంద్రానికి వెళ్లాలి: ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ 
ధర్పల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర రాజకీయాల్లోకి వెళితేనే బాగుంటుందని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. గురువారం నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లిలో మీడియాతో ఆయన మాట్లాడారు. యువకుడు కేటీఆర్‌ సీఎం అయితే బాగుంటుందని యువకులు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. దేశంలోనే యువ నేతల్లో కేటీఆర్‌ ఒకరని, ఆయనకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని, ముఖ్యమంత్రిగా అన్ని విధాల అర్హుడని అన్నారు. కేసీఆర్‌ కేంద్రానికి వెళితే బీజేపీ తప్పుడు విధానాలను ఎదిరిస్తారన్న నమ్మకం తెలంగాణ ప్రజలకు ఉందన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement