breaking news
Tera chinnapareddy
-
పార్టీ మారడం లేదు: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ
సాక్షి, హైదరాబాద్: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి స్పష్టం చేశారు. తనతో బీజేపీ నేతలు సంప్రదిస్తున్నారని వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. పార్టీ అధినేత కేసీఆర్‌కు, పార్టీకి ఎప్పుడూ విధేయుడిగానే ఉంటానన్నారు. తాను కూడా ఎవరితోనూ సంప్రదింపులు జరపడం లేదని చిన్నపరెడ్డి పేర్కొన్నారు. (చదవండి: పెద్దపల్లి జిల్లా బీజేపీలో ముసలం) కేసీఆర్ కేంద్రానికి వెళ్లాలి: ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ధర్పల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లోకి వెళితేనే బాగుంటుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో మీడియాతో ఆయన మాట్లాడారు. యువకుడు కేటీఆర్ సీఎం అయితే బాగుంటుందని యువకులు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. దేశంలోనే యువ నేతల్లో కేటీఆర్ ఒకరని, ఆయనకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని, ముఖ్యమంత్రిగా అన్ని విధాల అర్హుడని అన్నారు. కేసీఆర్ కేంద్రానికి వెళితే బీజేపీ తప్పుడు విధానాలను ఎదిరిస్తారన్న నమ్మకం తెలంగాణ ప్రజలకు ఉందన్నారు. -
టీడీపీకి తేరా గుడ్‌బై
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తెలుగుదేశం పార్టీకి జిల్లాకు చెందిన కీలక నేత తేరా చిన్నపరెడ్డి గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన బుధవారం ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. గతంలో నిర్ణయించుకున్న విధంగా ఈయన ఈనెల 16వ తేదీన టీఆర్ఎస్లో చేరనున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో హైదరాబాద్‌లో ఆయన పార్టీలో చేరుతారని టీఆర్ఎస్ వర్గాలు ధ్రువీకరించాయి. తెలుగుదేశం పార్టీని వీడాలని తేరా నిర్ణయించుకున్నారని, ఆయన త్వరలోనే టీఆర్ఎస్లో చేరతారని గతంలోనే వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు కూడా ధ్రువీకరించారు. అయితే, ఇప్పుడు చిన్నపరెడ్డే అధికారికంగా తన రాజీనామా లేఖను పార్టీకి పంపించారు. ఈయన టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోకముందునుంచే సామాజిక మీడియా ఫేస్బుక్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫొటోతో హల్చల్ చేస్తున్నారు. తన ఫేస్బుక్ ఐడీ బ్యాక్‌గ్రౌండ్‌గా కేసీఆర్ ఫొటో పెట్టుకున్న ఆయన తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలను షేర్ చేసుకుంటున్నారు. అయితే, టీఆర్ఎస్లో చేరనున్న చిన్నపరెడ్డి టీఆర్ఎస్ తరఫున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టికెట్ వస్తుందని, ఈ హామీ మేరకే ఆయన టీఆర్ఎస్లో చేరుతున్నారని ఆయన సన్నిహితులంటున్నారు. ఈ మేరకు కేసీఆర్ కూడా స్పష్టమైన హామీ ఇచ్చినట్టు తెలిసింది. చిన్నపరెడ్డిని టీఆర్ఎస్లోనికి తీసుకురావడంలో జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి కీలకపాత్ర పోషించారు. అయితే, తన చేరిక అట్టహాసంగా ఉండేలా చిన్నపరెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి పెద్ద ఎత్తున స్థానిక సంస్థల ప్రతినిధులను తనతో పాటు టీఆర్ఎస్లో చేరేలా ఆయన ఇప్పటికే ప్రణాళికలు రచించుకున్నట్టు సమాచారం.