మార్కులు తక్కువ వచ్చాయని...  | 8th class student commits suicide | Sakshi
Sakshi News home page

మార్కులు తక్కువ వచ్చాయని... 

Jan 25 2024 8:26 AM | Updated on Jan 25 2024 8:26 AM

8th class student commits suicide - Sakshi

గచ్చిబౌలి: పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయని తల్లి మందలించడంతో మనస్థాపానికి గురైన విద్యారి్థని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు..ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం గ్రామానికి చెందిన వాసిరెడ్డి సురేంద్రరెడ్డి మణికొండ పంచవటి కాలనీలో నివాసముంటున్నారు. కుమార్తె మనస్విని నెక్నాంపూర్‌లోని బ్లూమ్స్‌ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. కాగా ఇటీవలి పరీక్షల్లో మనస్వినికి తక్కువ మార్కులు వచ్చాయి.

దీంతో తల్లి శ్రీలక్ష్మి మందలించింది. దీంతో మనోవేదనకు గురైన మనస్విని ఇంట్లోని వారంతా నిద్రపోయిన తర్వాత అర్దరాత్రి ఒంటి గంట సమయంలో బయటకు వచ్చి తాము నివాసముండే అపార్ట్‌మెంట్‌ 3వ అంతస్తు నుంచి కిందకు దూకేసింది. అలికిడితో మేల్కొన్న తల్లిదండ్రులు, తోటివారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు పరిశీలించి స్పష్టం చేశారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని స్వా«దీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement