HC: 3.16 Lakh Cases Settled In Lok Adalat In TS - Sakshi
Sakshi News home page

లోక్‌అదాలత్‌లో 3.16 లక్షల కేసుల పరిష్కారం

Mar 13 2022 4:46 AM | Updated on Mar 13 2022 10:01 AM

3. 16 Lakh Cases Settled In Lok Adalat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో నిర్వహించిన మెగా లోక్‌అదాలత్‌లో 3,16,558 కేసులు పరిష్కరించి బాధితులకు రూ.118 కోట్లు పరిహారంగా అందించారు. ఇందులో 1,895 సివిల్‌ కేసులు, 2,95,501 లక్షల క్రిమినల్‌ కేసులు, 19,162 విచారణ దశలో ఉన్న (ప్రీలిటిగేషన్‌) కేసులున్నాయి. అదాలత్‌లో 1,20,451 కేసులను పరిష్కరించి రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉండగా, 68,147 కేసులను పరిష్కరించి హైదరాబాద్‌ జిల్లా ద్వితీయ స్థానంలో ఉంది.

హైకోర్టులో నిర్వహించిన లోక్‌అదాలత్‌లో 454 కేసులను పరిష్కరించి బాధితులకు రూ.8.5 కోట్లు పరిహారం అందించారు. ఇందులో రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌కు చెందిన కేసులు అత్యధికంగా సెటిలైనట్లు లీగల్‌ ఆఫీసర్లు రాజేశ్, మహమ్మద్‌ షబ్బీర్‌ తెలిపారు. సిటీ సివిల్‌ కోర్టులో 713 కేసులను పరిష్కరించి బాధితులకు రూ.28 కోట్లు పరిహారం అందించినట్లు అథారిటీ చైర్మన్‌ రేణుక, కార్యదర్శి మురళీమోహన్‌ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement