TS IAS Officers Transfer: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. | Sakshi
Sakshi News home page

TS IAS Officers Transfer: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. స్మిత సబర్వాల్‌ ట్రాన్స్‌ఫర్‌

Published Wed, Jan 3 2024 4:37 PM

26 IAs Officers Transferred Including Smita sabharwal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. 26 మంది  ఐఏఎస్‌ అధికారులకు బదిలీ, పదోన్నతులు  కల్పిస్తూ  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

సీఎంవో సెక్రటరీగా చంద్ర శేఖర్ రెడ్డి(IFS)ని నియమించింది. బదిలీ అయిన వారిలో సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబాబాద్‌, నల్గొండ, గద్వాల కలెక్టర్‌లు ఉన్నారు. ఇక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్వాల్‌పై కూడా బదిలీ వేటు పడింది. సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా  ఉన్న స్మిత.. రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ మెంబర్‌ సెక్రటరీగా  స్థానచలనం పొందారు.

► రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా శశాంక నియామకం
►నల్గొండ కలెక్టర్‌గా దాసరి హరిచందన.
►మహబూబాబాద్‌ కలెక్టర్‌గా అద్వైత్‌ కుమార్‌.
►సంగారెడ్డి కలెక్టర్‌గా వల్లూరు క్రాంతి.
►గద్వాల కలెక్టర్‌గా బీఎం సంతోష్‌

►సీఎం ఓఎస్డీగా వేముల శ్రీనివాసులు
►నీటిపారుదలశాఖ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జ 
►మైన్స్ అండ్ జియోలజి ప్రిన్సిపల్‌గా మహేష్ ధత్ ఎక్కా..
►పురావస్తు శాఖ డైరెక్టర్‌గా భారతీ హోళికేరి
►మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌గా డీ దివ్య నియామకం
►టీఏస్  డైరీ కార్పొరేషన్ ఎండీగా చిట్టెం లక్ష్మి
►ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా శరత్.
► ప్రణాళికాశాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్‌ నదీమ్‌

►కార్మికశాఖ కార్యదర్శిగా కృష్ణ ఆదిత్యా .
►మైనార్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఎంఎం ఖానమ్‌.
►సీఎంఓ జాయింట్ సెక్రటరీగా సంగీత సత్యనారాయణ.
►జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషర్‌గా అభిలాష అభినవ్.

►హైదరాబాద్ లోకల్ బాడిస్ అడిషనల్ కలెక్టర్‌గా ఖదిరావన్.
►బీసీ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శిగా బుర్ర వెంకటేష్ నియామకం.
►పంచాయతీరాజ్‌, ఆర్‌డీ కార్యదర్శిగా సందీప్ కుమార్ సల్తానియా.
►పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీగా జ్యోతి బుద్ధ ప్రకాశ్.
►GAD పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రఘునందన్ రావు నియామకం.

►ఆయుష్ డైరెక్టర్‌గా ఎం ప్రశాంతి.
►ఫైనాన్స్, ప్లానింగ్‌ స్పెషల్ సెక్రటరీగా కృష్ణ భాస్కర్.
►TSMSIDC ఎండీగా కర్ణన్.
►రిజిష్టర్ అండ్ కో - ఆ సొసైటీ డైరెక్టర్ హరిత.

ఇక ఫైనాన్స్ సెక్రెటరీగా చేసిన రామకృష్ణ రావుకు ఎలాంటి పోస్ట్ కేటాయించలేదు ప్రభుత్వం.

Advertisement
Advertisement