ఉగ్రం యూ–51 పేరుతోఅసాల్ట్ రైఫిల్.. హైదరాబాద్‌కుచెందిన ద్విపా డిఫెన్స్ ఇండియా సంస్థ రూపకల్పన
వారంలో సశస్త్ర సీమా బల్‌కు 200 ఆయుధాలు
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలోని జూబ్లీహిల్స్‌కు చెందిన ద్విపా డిఫెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన ‘ఉగ్రం యూ–51’ అనే అసాల్ట్ రైఫిల్.. సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ) నుంచి భారీ ఆర్డర్ దక్కించుకుంది. ఇప్పటికే వివిధ కేంద్ర సాయుధ బలగాలకు వివిధ రకాల తుపాకుల్ని సరఫరా చేసిన ద్విపా సంస్థ ఇప్పుడు ఎస్‌ఎస్‌బీకి 200 యూ–51లు సరఫరా చేయనుంది. పుణెలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (డీఆర్‌డీఓ) అనుబంధ సంస్థ ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌తో (ఏఆర్‌డీఈ) కలిసి యూ–51ను డిజైన్ చేసింది.
ద్విపా సంస్థ సిద్దిపేట జిల్లాలో 13 ఎకరాల్లో విస్తరించి ఉన్న తన సొంత యూనిట్‌లో రెండేళ్ల నుంచి వీటిని తయారు చేస్తోంది. ఈ సంస్థ తయారు చేసిన ఆయుధాలు సైన్యం, కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు డిమాండింగ్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేశాయి. ఇప్పటికే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్‌ఎస్‌జీ), ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటీబీపీ), సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)కు ఈ అసాల్ట్ రైఫిల్స్‌ను సరఫరా చేస్తుండగా, మరో వారంలో ఎస్‌ఎస్‌బీకి అందించనుంది.
గ్యాస్ ఆపరేటెడ్, రొటేటింగ్ బోల్ట్ వ్యవస్థతో పనిచేసే అసాల్డ్ రైఫిల్ బరువు 4 కిలోల కంటే తక్కువే. అన్ని భౌగోళిక, వాతారణ పరిస్థితుల్లో సమర్థమంతంగా ఇది పని చేస్తుంది. కాగా, యూ–45 అసాల్ట్ రైఫిల్, ఏకే47తో సమానంగా పని చేసే యూ–39 రైఫిల్‌తోపాటు యూ–51 ఆధారిత ఆయుధీకరించిన యాంటీ డ్రోన్ వ్యవస్థనూ ఈ సంస్థ రూపొందించింది.
ఉగ్రం యూ–51 ప్రత్యేకతలివీ..
ఇది 7.62 X 51 మి.మీ. క్యాలిబర్ కలిగిన అసాల్ట్ రైఫిల్
ఫైరింగ్ రేంజ్: 600 మీటర్లు, ఎఫెక్టివ్ రేంజ్: 500 మీటర్లు
సామర్థ్యం: నిమిషానికి కనిష్టంగా 600 రౌండ్లు
బరువు: 4 కేజీల కంటే తక్కువ
పొడవు: 3.16 అడుగులు
మ్యాగజైన్ సామర్థ్యం: 20 రౌండ్లు
ఆపరేషన్: గ్యాస్ ఆపరేటెడ్ రొటేటింగ్ బోల్ట్..
ఫైరింగ్ మోడ్స్: సేఫ్, సింగిల్, ఆటో
భద్రత: అప్‌లైడ్ మెకానికల్ సేఫ్టీ


