
కేపీహెచ్‌బీ కాలనీ(హైదరాబాద్): కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగిన ఘటనలో మృతుల సంఖ్య మూడు చేరింది. కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగి 15 మందికి అస్వస్థత చోటు చేసుకుంది. అయితే ఈ సంఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగిన ఘటనలో ముగ్గురు ఇద్దరు మృతి చెందారు . గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఇద్దరు చెందారు. ఇంట్లోనే ఉన్న మరో వ్యక్తి మృతి చెందారు. మృతులు తులసిరామ్ (47), బొజ్జయ్య (55), నారాయణమ్మ (65)గా గుర్తించారు. మృతులంతా హెచ్‌ఎంటీ హిల్స్ సాయిచరణ్ కాలనీకి చెందినవారుగా గుర్తించారు.

ఎమ్మెల్యే మాధవరం పరామర్శ
విషయం తెలుసుకున్న కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెంటనే ఆసుపత్రికి చేసుకుని వైద్యులను అడిగి పరిస్థితిని తెలుసుకున్నారు. అస్వస్థతకు కారణాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. కల్తీ కల్లు విషయంలో పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే గాందీ
కల్తీ కల్లు తాగి ఆసుపత్రి పాలైన వారిని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పరామర్శించారు. అక్కడే ఉన్న వైద్యులను, పోలీసులు, ఎక్షైజ్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కల్తీ కల్లు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చాలాకాలంగా కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.