TSRTC: T 9 Ticket For Rural Urban People In Pallevelugu Bus - Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. వారికోసం ‘టీ-9 టికెట్’.. ప్రయోజనాలివే

Jun 16 2023 1:36 PM | Updated on Jun 16 2023 2:25 PM

TSRTC: T 9 Ticket For Rural Urban People In Pallevelugu Bus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికులకు ఆర్థికభారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటీజన్ల కోసం ‘టీ-9 టీకెట్’ అందుబాటులోకి తెచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీ-24, టీ-6, ఎఫ్-24 టీకెట్లను ఇప్పటీకే అందిస్తోన్న సంస్థ..  తొలిసారిగా గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికుల సౌకర్యార్థం టీ-9 టీకెట్ ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో శుక్ర‌వారం ‘టీ-9 టీకెట్’ పోస్టర్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆవిష్కరించారు. ఈ టీకెట్ ఈ నెల 18(ఆదివారం) నుంచి పల్లె వెలుగు బస్సుల్లో కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. 

►‘టీ-9 టీకెట్’ పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటీజన్స్‌కు వర్తిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ టీకెట్ చెల్లుబాటు అవుతుంది.

►ఈ టీకెట్ ద్వారా 60 కిలోమీటర్ల పరిధిలో ఒక్కసారి రానూపోను ప్రయాణం చెయొచ్చు.

► ‘టీ-9 టీకెట్’ కు రూ.100  ధరగా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. టోల్ గేట్ చార్జీల‌పైన మిన‌హాయింపు ఇచ్చింది. దీంతో ఈ టీకెట్ ద్వారా ఒక్కోక్కరికి రూ.20  నుంచి రూ.40 వ‌ర‌కు ఆదా అవుతుంద‌ని సంస్థ ప్ర‌క‌టీంచింది. 

►60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటీజన్లు వయసు ధృవీకరణ కోసం తమ ఆధార్ కార్డును కండక్టర్లకు చూపించి టీ-9 టీకెట్ పొందవచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ టీకెట్లను కండక్టర్లు ఇస్తారు.

►తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే ఈ టీకెట్ చెల్లుబాటు అవుతుంది. 
చదవండి: Hyderabad: నేడు, రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఆ రూట్లో వెళ్లకండి!

‘పల్లె వెలుగు బ‌స్సుల్లో ప్రతి రోజు సగటున 15 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అందులో మహిళలు, సీనియర్ సిటీజన్లు ఎక్కువగా ఉన్నారు. వారికి ఆర్థికభారం తగ్గించాలనే ఉద్దేశంతోనే పల్లెవెలుగు బస్సుల్లో ‘టీ-9 టీకెట్’కు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టీంది. ఈ టీకెట్ తో రూ.100  చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించవచ్చు. గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని సంస్థను ఆదరించాలి’ అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ కోరారు. 

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటీకే టీ-24, టీ-6, ఎఫ్-24 టీకెట్లను అందుబాటులోకి తెచ్చామని, వాటీకి ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోందని గుర్తు చేశారు. ఆ టీకెట్లకు మంచి స్పందన వ‌స్తుండ‌టంతో తొలిసారిగా గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికుల కోసం ‘టీ-9 టీకెట్’ను తీసుకువచ్చామని చెప్పారు. ఈ టీకెట్ కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. 

‘టీ-9 టీకెట్’ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సంస్థ చీఫ్ ఆపరేటీంగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటీల్, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్(ఈడీ)లు, పీవీ ముని శేఖర్, పురుషోత్తం, కృష్ణ కాంత్, సీటీఎం జీవన్ ప్ర‌సాద్‌, సీఎంఈ రఘునాథరావు, సీఈఐటీ రాజశేఖర్‌, సీఎఫ్ఎం విజ‌య‌పుష్ఫ, త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement