డ్రై పోర్టులు.. | - | Sakshi
Sakshi News home page

డ్రై పోర్టులు..

Nov 26 2026 1:23 AM | Updated on Nov 26 2026 1:23 AM

రూ. 58,214 కోట్ల పెట్టుబడి రాక

65,786 మందికి ఉపాధి

తమిళనాడులో పారిశ్రామిక అభివృద్ధిని మరింత వేగవంతం చేసే లక్ష్యంతో, రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని కీలక ప్రదేశాలలో రూ. 15,250 కోట్ల పెట్టుబడితో 12 మల్టీమోడల్‌ లాజిస్టిక్స్‌ పార్కులు , డ్రై పోర్టులను ఏర్పాటు చేయడానికి, అలాగే 8,375 మందికి ఉపాధి కల్పించడానికి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. రూ. 125 కోట్ల పెట్టు బడితో ఒక ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పార్కును ఏర్పా టు చేయడానికి కూడా ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు పారిశ్రామిక అభివృద్ధిని విస్తరించేందుకు 25 జిల్లాల్లో పెట్టుబడికి సంబంధించిన అవగాహన ఒప్పందాలపై సంతకాల జరిగాయి. ఇందులో శివగంగ, ధర్మపురి, విరుదునగర్‌, కడలూరు, విల్లుపురం, రామనాథపురం, తిరువణ్ణామలై , తేని వంటి వెనుకబడిన జిల్లాల్లో కూడా పారిశ్రామిక పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే 18 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. వీటి ద్వారా రూ. 17,413 కోట్ల పెట్టుబడులు, 16,411 మందికి ఉపాధి కలుగుతున్నాయి.

సాక్షి, చైన్నె:సీఎం విజయ్‌ నేతృత్వంలోని టీవీకే సర్కా రు పెట్టుబడులను ఆహ్వానించడంపై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని వనరుల ఆధారంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రత్యేక రాయితీలను కల్పించడ మే కాకుండా, తక్షణ అనుమతులు తదితర వసతుల కల్పన దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం చైన్నెలో సీఎం విజయ్‌ సమక్షంలో జరిగిన వెట్రి తమిళనాడు పెట్టుబడి , అమలు సదస్సులో, పరిశ్రమ, పెట్టుబడి ప్రోత్సాహం, వాణిజ్య శాఖ తరఫున 78 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. వీటి ద్వారా రూ. 58,214 కోట్ల పెట్టుబడితో పాటు 65,786 మందికి ఉపాధి లభిస్తుంది. అలాగే ఆయన రూ. 7,925 కోట్ల పెట్టుబడితో 19,965 మందికి ఉపాధి కల్పించే 15 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. దీని అనంతరం, రూ. 1,430 కోట్ల పెట్టుబడితో 1,710 మందికి ఉపాధి కల్పించే 6 ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. 5 కంపెనీలలో వివిధ పోస్టులకు ఎంపికై న 18 మందికి ఆయన నియామక పత్రాలు కూడా జారీ చేశారు. ఈ సమావేశానికి ముందు కుదిరిన అవగాహన ఒప్పందాల జరిగిన రెండవ పెట్టుబడి సమావేశంలో విజయవంతగా కుదిరిన ఒప్పందాల ద్వారా, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 200 రోజుల్లో 190 అవగాహన ఒప్పందాల ద్వారా రూ. 1.73 లక్షల కోట్లకు పైగా విలువైన పెట్టుబడులను ఆకర్షించడం జరిగిందని టీవీకే పాలకులు ప్రకటించారు. దీని ద్వారా . 1,98,557 మందికి ఉపాధి కల్పించడం జరిగిందన్నారు.

కొన్ని కీలక ప్రాజెక్టులు

హ్యుందాయ్‌ విడిభాగాల సరఫరాదారు అయిన హ్వాషిన్‌ ఆటోమోటివ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ. 850 కోట్లు, సియోయాన్‌ ఇ–హ్వా సమ్మిట్‌ ఆటోమోటివ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ. 520 కోట్లు తమ విస్తరణ ప్రణాళికల కోసం రూ. 1,370 కోట్ల కొత్త పెట్టుబడితో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. దీని ద్వారా 500 మందికి ఉపాధి లభిస్తుంది. అలాగే, దక్షిణ కొరియాలోని ఒక ప్రముఖ పారిశ్రామిక సంస్థ, ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారులలో ఒకటి , ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీ ముడి పదార్థాల ప్రధాన ప్రపంచ సరఫరాదారు అయిన పోస్కో, కృష్ణగిరి జిల్లాలో రూ. 250 కోట్ల పెట్టుబడితో , 200 మందికి ఉపాధి కల్పిస్తూ ఒక ఉక్కు శుద్ధి ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఇక, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సంస్థ రూ. 1,000 కోట్ల పెట్టుబడితో, 500 కొత్త ఉద్యోగాల కల్పనతో భారతదేశపు మొట్టమొదటి ద్విచక్ర ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌ను (టూ–వీలర్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌) తమిళనాడులో ప్రారంభించనుంది. ఇది ప్రీమియం ఈవీ మోటార్‌సైకిళ్ల తయారీకి ప్రపంచ కేంద్రంగా తమిళనాడు స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. తమిళనాడులో అభివృద్ధి చేయబడుతున్న ఇంజనీరింగ్‌ , పనితనపు నైపుణ్యాన్ని ప్రదర్శించే సి6 మోడల్‌ను ఈ సమావేశంలో ప్రదర్శించారు.

వస్త్ర కంపెనీల జోరు..

తమిళనాడులోని రామ్‌రాజ్‌, ఎస్‌సిఎం, అవనీత, కెపిఆర్‌, అర్ధనారి, ఎల్‌ఎస్‌ మిల్స్‌ , జిహెచ్‌సిఎల్‌ వంటి ప్రముఖ వస్త్ర కంపెనీలు, తమ తయారీ సామర్థ్యాన్ని , దేశీయ బ్రాండ్‌లను విస్తరించడానికి గణనీయమైన పెట్టుబడులు పెట్టేందుకు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. త్యాగరాజర్‌ మిల్స్‌, జర్మనీకి చెందిన యూరో టెక్స్‌టైల్స్‌తో విరుదునగర్‌లో రూ. 100 కోట్ల పెట్టుబడితో కాటన్‌ జాక్వర్డ్‌ ఫ్యాబ్రిక్‌ తయారీ ప్లాంటును ఏర్పాటు చేయడానికి , టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌ రంగంలో విస్తరించడానికి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. పైన పేర్కొన్న రంగాలలో రూ. 3,928 కోట్ల పెట్టుబడితో , 14,650 మందికి ఉపాధి కల్పించే 9 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. స్వీడన్‌కు చెందిన పిఎంసి హైడ్రాలిక్స్‌, బెంగళూరులోని తన తయారీ యూనిట్‌లో కొంత భాగాన్ని తమిళనాడుకు తరలించనున్నది. రూ. 300 కోట్ల పెట్టుబడితో, 300 మందికి ఉపాధి కల్పిస్తూ కృష్ణగిరిలో తన మొదటి తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. జేకే ఫెన్నర్‌ శివగంగలో ఒక భారీ కొత్త తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి రూ. 900 కోట్లు పెట్టుబడి పెట్టి, 1,650 మందికి ఉపాధి కల్పించనుంది. బ్రెజిలియన్‌ కంపెనీ డబ్ల్యు ఈజీ ధర్మపురి జిల్లాలోని తన సమీకృత తయారీ ప్లాంట్‌ విస్తరణలో భాగంగా, రూ. 2,000 కోట్ల పెట్టుబడితో 3,000 మందికి ఉపాధి కల్పిస్తూ ఒక కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది.

అమెజాన్‌ సెల్లర్‌ సర్వీసెస్‌

తమిళనాడులోని పారిశ్రామిక సంస్థలు, తయారీదారులు, కళాకారులు, నేత కార్మికులు , పారిశ్రామికవేత్తల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌ అవకాశాలను కల్పించడానికి , ఇ–కామర్స్‌ ద్వారా ఎగుమతులను ప్రోత్సహించడానికి అమెజాన్‌ సెల్లర్‌ సర్వీసెస్‌తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో సీఎం విజయ్‌తో పాటుగా పరిశ్రమల మంత్రి కీర్తన, వాణిజ్య శాఖమంత్రి మహ్మద్‌పర్వేజ్‌, సీఎస్‌ సాయికుమార్‌,అదనపు ముఖ్య కార్యదర్శి ఎస్‌ విజయకుమార్‌, గైడ్‌ లైన్‌ తమిళనాడు సీఈఓ దీపక్‌ జాకబ్‌, ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ పల్లవి వర్మ తదితరులు పాల్గొన్నారు. 2030 నాటికి తమిళనాడు ఆర్థిక వృద్ధి 1.5 ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యం నినాదాలతో ఈ సదస్సు పరిసరాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సీఎం విజయ్‌ సమక్షంలో 78 ఒప్పందాలు

కార్పొరేట్‌ అవగాహన ఒప్పందం..

శివగంగ జిల్లాలోని కనడుకథన్‌లో ఉన్న చెట్టినాడ్‌ ఏరోడ్రోమ్‌లో ఒక ప్రత్యేక డ్రోన్‌ ఇండస్ట్రియల్‌ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు, చెట్టినాడ్‌ ఏరోస్పేస్‌ డెవలప్‌మెంట్‌ అలయన్స్‌ , తమిళనాడు ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదరింది. ఈ హబ్‌ డ్రోన్‌ తయారీ, సాంకేతిక అభివృద్ధి, నమూనా రూపకల్పన, పరీక్ష మరియు శిక్షణను ఏకీకృతం చేస్తుంది. అన్నా యూనివర్సిటీకి చెందిన సెంటర్‌ ఫర్‌ స్పేస్‌ రీసెర్చ్‌చే నిర్వహించబడేబీవీఎల్‌ఓఎస్‌పరీక్ష , శిక్షణా కేంద్రం కూడా ఈ ప్రాజెక్టులో ఒక కీలక భాగంగా ఉంటుంది.

గగనతలం భద్రత..

తాజాగా కుదిరిన అవగాహన ఒప్పందాలలో, 12 కంపెనీలు ఏరోస్పేస్‌ , రక్షణ రంగానికి చెందినవి కూడా ఉన్నాయి. అవన్నీ తదుపరి తరం ఏరోస్పేస్‌, రక్షణ సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్న స్టార్టప్‌లే. ఈ రంగంలో స్టార్టప్‌లకు, ఆవిష్కర్తలకు , పారిశ్రామికవేత్తలకు తమిళనాడు గొప్ప అవకాశాలను కల్పిస్తుందని నిరూపించారు. సంతకాలు చేసిన మొత్తం 78 అవగాహన ఒప్పందాలలో, 58 కొత్త పారిశ్రామిక ప్రాజెక్టుల గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టులు స్థాపనకు సంబంధించినవి ఉన్నాయి. ఇవి మొత్తం పెట్టుబడి విలువలో 64 శాతంగా ఉన్నాయి. అంతేకాకుండా, 18 ఇప్పటికే ఉన్న పరిశ్రమల విస్తరణకు (బ్రౌన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టులు) సంబంధించినవి కాగా, 2 ప్రాజెక్టులు కొత్త పెట్టుబడి , విస్తరణ రెండింటినీ కలిగి ఉన్న మిశ్రమ ప్రాజెక్టులు ఉన్నాయి.బ్రెజిల్‌, ఫిన్లాండ్‌, జర్మనీ, సింగపూర్‌, దక్షిణ కొరియా, స్వీడన్‌ , అమెరికాలో ప్రధాన కార్యాలయాలు కలిగిన 14 కంపెనీలు రూ. 14,798 కోట్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టాయి. ఇది తమిళనాడుపై అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఉన్న విశ్వాసాన్ని మరియు ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా దాని ఆవిర్భావాన్ని తెలియజేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement