అన్బిల్‌ మహేష్‌ సహా ముగ్గురిని కస్టడీకి అప్పగింత | - | Sakshi
Sakshi News home page

అన్బిల్‌ మహేష్‌ సహా ముగ్గురిని కస్టడీకి అప్పగింత

Nov 26 2026 1:23 AM | Updated on Nov 26 2026 1:23 AM

న్యూస్‌రీల్‌

సాక్షి, చైన్నె : ప్రైవేట్‌ పాఠశాలలకు శాశ్వత అనుమతులు ఇప్పిస్తామంటూ రూ. 400 కోట్ల మేర వసూళ్లకు పాల్పడిన కేసులో డీఎంకే మాజీ మంత్రి అన్బిల్‌ మహేష్‌ సహా ముగ్గురిని పోలీసు కస్టడీకి అప్పగిస్తూ చైన్నె ప్రత్యేక కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 11 గంటల నుంచిగురవారం సాయంత్రం 5 గంటల వరకు వారిని విచారించేందుకు పోలీసులకు కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రైవేట్‌ పాఠశాలలకు శాశ్వత గుర్తింపు అనుమతులు మంజూరు చేసే నెపంతో రూ. 400 కోట్లకు పైగా వసూలు చేశారనే ఆరోపణలపై మాజీ మంత్రి అన్బిల్‌ మహేష్‌, మాజీ ఎమ్మెల్యే ముత్తుకుమార్‌, , శరవణన్‌లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరిపేందుకు నిందితులు ముగ్గురినీ రెండు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ చైన్నె సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అవినీతి నిరోధక ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఎల్‌.ఎస్‌. సత్యమూర్తి, ముగ్గురు నిందితులను బుదవారం కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఉదయం విచారణ జరిపిన న్యాయమూర్తి ఎల్‌.ఎస్‌. సత్యమూర్తి, అన్బిల్‌ మహేష్‌, ముత్తుకుమార్‌, శరవణన్‌లను విచారణ నిమిత్తం పోలీసు కస్టడీకి అప్పగిస్తూ తీర్పు వెలువరించారు. ఉదయం 11 గంటల నుండి గురువారం సాయంత్రం 5 గంటల వరకు విచారించేందుకు అనుమతిస్తూ, గతంలో విధించిన అన్ని నిబంధనలు, షరతులు ఈ కస్టడీ సమయంలోనూ వర్తిస్తాయని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

అధిష్టానం ముందస్తు అనుమతి తప్పనిసరి

సాక్షి, చైన్నె: పార్టీ విధానాలు, వివిధ ఘటనలపై అభిప్రాయాలను మీడియాలో వెల్లడించే విషయంలో అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం నాయకత్వం కీలక ఆంక్షలు విధించింది. పార్టీ వైఖరికి సంబంధించి ఏదైనా ప్రకటన చేయాలన్నా, ఇంటర్వ్యూలు ఇవ్వాలన్నా ముందుగా పార్టీ అధిష్టానం నుండి అనుమతి పొందడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి ఆమోదంతో అన్నాడీఎంకే కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఎంజీఆర్‌ , జయలలిత ఆశయాలతో అన్నాడీఎంకే ఒక క్రమశిక్షణ గల వ్యవస్థీకృత ఉద్యమంగా పనిచేస్తున్నట్టు అందులో వివిరంచారు.పార్టీ కేంద్ర కార్యదర్శులు, జిల్లా కార్యదర్శులు, అధికార ప్రతినిధులతో సహా అన్ని స్థాయిల్లోని నేతలు, నిర్వాహకులు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.వివిధ పరిణామాలపై పార్టీ అభిప్రాయాలను వార్తాపత్రికలు, టెలివిజన్‌ ఛానెళ్లు , సోషల్‌ మీడియా వేదికలపై వ్యక్తం చేసే ముందు నాయకత్వం అనుమతి తీసుకోవాలని సూచించారు.అదేవిధంగా, పార్టీ తరఫున ఏదైనా పత్రికా ప్రకటనను విడుదల చేయాలన్నా అధిష్టానం ఆమోదం పొందిన తర్వాతే ప్రచురించాలని ఆదేశించారు. పార్టీ శ్రేణులందరూ ఈ ఆదేశాలను తప్పకుండా పాటించాలని నాయకత్వం ఆ ప్రకటనలో హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement