మళ్లీ కోర్టుకు తిరుప్పరకుండ్రం వివాదం | - | Sakshi
Sakshi News home page

మళ్లీ కోర్టుకు తిరుప్పరకుండ్రం వివాదం

Nov 20 2026 1:54 AM | Updated on Nov 20 2026 1:54 AM

– హిందూ మక్కల్‌ కట్చి పిటిషన్‌పై విచారణ

సాక్షి, చైన్నె: తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీప స్థంబంపై కార్తీక దీపం వెలిగించాలని డిమాండ్‌ చేస్తూ నవంబర్‌ 22న నిరసన ప్రదర్శనకు అనుమతి కోరుతూ హిందూ మక్కల్‌ కట్చి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను మద్రాస్‌ హైకోర్టు మదురై ధర్మాసనం శుక్రవారానికి వాయిదా వేసింది. ఆ సంస్థ మదురై జిల్లా అధ్యక్షుడు సోలై కన్నన్‌ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. నవంబర్‌ 22న తిరుపరంకుండ్రం సన్నది వీధిలోని మయిల్‌ మండపంలో స్కంద షష్టి కవచ పారాయణం నిర్వహించడానికి, కొండపై ఉన్న దీప స్తంభంపై కార్తీక దీపం వెలిగించడానికి , పాత బస్‌ స్టాండ్‌ సమీపంలో ప్రజల దృష్టిని ఆకర్షించే నిరసన ప్రదర్శన చేపట్టడానికి అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. దీనిపై పోలీసులకు వినతిపత్రం ఇచ్చినప్పటికీ స్పందన రాలేదని పిటిషనర్‌ తరఫున పేర్కొన్నారు.ఈ పిటిషన్‌ న్యాయమూర్తి జస్టిస్‌ తిలగవతి ఎదుట విచారణకు రాగా, పిటిషనర్‌ కోరిన ప్రదేశంలో నిరసనకు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని తమిళనాడు ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, వారు కోరుకుంటే ప్రత్యామ్నాయ ప్రదేశంలో అనుమతి ఇవ్వవచ్చ ని ప్రభుత్వం పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించి సమర్పించేందుకు సమయం కావాలని ప్రభుత్వ తరఫు న్యాయవా ది కోరడంతో, న్యాయమూర్తి తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. ఇప్పటికే ఇక్కడ దీపం వెలిగించే వివాదం వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసిందే.

ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌

చైన్నె పర్యటన

– డ్రోన్లపై రెండు రోజుల నిషేధం, రెడ్‌ జోన్ల ప్రకటన

సాక్షి, చైన్నె: ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ చైన్నె పర్యటన నేపథ్యంలో చైన్నె మెట్రోపాలిటన్‌ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రెండు రోజుల పాటు డ్రోన్ల ఎగురవేతపై నిషేధం విధించడంతో పాటు, ఆయన ప్రయాణించే మార్గాలను రెడ్‌ జోన్‌లుగా ప్రకటించారు. చైన్నె ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్డు కొట్టివాకం వద్ద ఉన్న నైల్లె నాడార్‌ మెట్రిక్యులేషన్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ 42వ వార్షికోత్సవానికి ఈనెల 21 మధ్యాహ్నం 2.30 గంటలకు ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడంతో పాటు ప్రత్యేక ప్రసంగం చేస్తారు. ఈనెల 21, 22 తేదీలలో మీనంబాక్కం, కొట్టివాకం, గిండి, నీలంకరై, మైలాపూర్‌ ప్రాంతా లతో పాటు ఉపరాష్ట్రపతి ప్రయాణించే మార్గాల ను రెడ్‌ జోన్లుగా ప్రకటించారు. ఈ రెండు రోజు ల పాటు ఆయా ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలు, మానవరహిత వైమానిక వాహనాల ఎగురవే తను నిషేధించారు అలాగే, చైన్నెలో డ్రోన్లు, మైక్రోలైట్‌ విమానాలు, పారాగ్లైడర్లు, పారామోటార్లు, హ్యాంగ్‌ గ్లైడర్లు, హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ల ఎగురవేతపై డిసెంబర్‌ 15 వరకు ఇప్పటికే నిషేధాజ్ఞలు అమల్లో ఉండగా, పోలీస్‌ కమిషనర్‌ అమల్‌రాజ్‌ ఆధ్వర్యంలో ఉపరాష్ట్రపతి పర్యటన కోసం అదనపు భద్రతా చర్యలు చేపట్టారు.

శబరిమలకు ప్రత్యేక బస్సులు

కొరుక్కుపేట: శబరిమల అయ్యప్ప ఆలయ పూజ , దీపోత్సవం సందర్భంగా, తమిళనాడులోని ప్రధాన నగరాల నుండి జనవరి వరకు ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్‌ రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. చైన్నె, కోయంబేడు, కిలం బాక్కం,తిరుచ్చి, మదురై, పుదుచ్చేరి, కడలూరు, హోసూర్‌ నుండి సూపర్‌ లగ్జరీ ఫ్లోట్‌ బస్సులు. ఏసీ బస్సులు , సీట్లు, స్లీపర్‌లతో కూడిన నాన్‌–ఏసీ ప్రత్యేక బస్సులు నడపనున్నారు. శబరిమల దేవస్థానాల ప్రకటన ప్రకారం, ఆలయం డిసెంబర్‌ 27 నుండి డిసెంబర్‌ 30 వరకు మూసివేస్తారు. ఈ సంవత్సరం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని అంచనా వేస్తున్నందున, చైన్నె , ఇతర ప్రాంతాలు, వివిధ ప్రాంతాల నుంచి అదనపు బస్సులను నడపడానికి అనుమతి పొందింది. ప్రత్యేక ప్రాతిపదికన బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేశారు. భక్తులకు అద్దె ప్రాతిపదికన బస్సు సౌకర్యాలు కూడా కల్పించబడతాయి. ఈ ప్రత్యేక బస్సులను ఆన్‌లైన్‌లో ముందుగానే బుక్‌ చేసుకోవచ్చు. బుకింగ్‌, వినియోగం కోసం తమిళనాడు స్టేట్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ అధికారిక యాప్‌, వాట్సాప్‌ నంబర్‌ 9444018898, స్టేట్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ రిజర్వేషన్‌ కేంద్రాలు, యోస్క్‌ మెషీన్‌లను ఉపయోగించుకోవచ్చు. అలాగే, బస్సుల గురించిన వివరాలు , ఇతర సమాచారం కోసం, 84450 14446, 9445014424 మరియు 94450 14463 నంబర్లను సంప్రదించవచ్చని తమిళనాడు స్టేట్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement