మహిళా సంఘాల ధర్నా | - | Sakshi
Sakshi News home page

మహిళా సంఘాల ధర్నా

Nov 20 2026 1:54 AM | Updated on Nov 20 2026 1:54 AM

వేలూరు: కళ్లకుర్చి టీవీకే ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని కోరుతూ వేలూరు ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఉమెన్స్‌ అసోషియేషన్‌ అద్వర్యంలో వేలూరులోని అన్నారోడ్డులో ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఆ కమిటీ జిల్లా సభ్యురాలు భువనేశ్వరి నాయకత్వంలో జరిగిన ఈ ధర్నాలో సెల్వరాణి, జ్యోతిక, శివరంజని, సెల్వి, వివిధ మ హిళా సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నా రు. మహిళలు మాట్లాడుతూ సెంజిలో అదృశ్యమైన బాలికను వెతికిపట్టు కోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, తమిళనాడులో లైంగిక హింసకు సంబంధించిన పరిస్థితులు క్షీణిస్తున్న నేపథ్యంలో మహిళలకు, బాలికలకు రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను తీసుకు రావాలని, అదే విధంగా కళ్లకుర్చి కలెక్టర్‌కు అసభ్యకరమైన ఎస్‌ఎంఎస్‌లు పంపిన టీవీకే ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేయడంతో పాటు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీవీకే ఎమ్మెల్యేలు చేస్తున్న ఆగడాలను ప్రజలు చూస్తున్నారని వీటికి త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెపుతారన్నారు. ఈ ధర్నాలో మహిళా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement