వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జరుపుకున్నారు. ముందుగా వేలూరు అన్నా రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అద్యక్షులు వాహీద్ బాషా అధ్యక్షతన పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకొని ఇందిరాగాంధీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశంలోనే మొదటి మహిళా ప్రధానిగా ఎన్నికై ఉక్కు మనిషిగా పేరుగాంచిన ఏకై క నాయకురాలు ఇందిరాగాంధీ అని కొనియాడారు. అనంతరం స్వీట్లు పంచి పెట్టడంతో పాటు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జిలాని, రీజినల్ అధ్యక్షులు మునియప్పన్, రగు, కప్పల్మణి, తులసి, కార్యకర్తలతో పాటు ఆటో కార్మిక సంఘం ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదే విధంగా తిరుపత్తూరు, రాణిపేట, తిరువణ్ణామలై జిల్లాలోనూ కార్యకర్తలు ఇందిరాగాంధీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.


