కీర్తీ సురేష్‌ స్థాయి అంతగొప్పది..! | - | Sakshi
Sakshi News home page

కీర్తీ సురేష్‌ స్థాయి అంతగొప్పది..!

Nov 20 2026 1:54 AM | Updated on Nov 20 2026 1:54 AM

తమిళసినిమా: నటి కీర్తీ సురేష్‌ ఇంతకు ముందు టైటిల్‌ పాత్రను పోషించిన చిత్రం మహానటి. ఈ చిత్రం తమిళంలో నడిగైయార్‌ తిలకం పేరుతో విడుదలైన విషయం తెలిసిందే. అదే విధంగా ఈ చిత్రం కీర్తీ సురేష్‌ కు జాతీయ ఉత్తమ నటి అవార్డు అందించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా నటి కీర్తీ సురేష్‌ ప్రధాన పాత్రను పోషించిన చిత్రం సత్యవాన్‌ సావిత్రి. దర్శకుడు మిష్కిన్‌ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రం ద్వారా ప్రవీణ్‌ ఎస్‌.విజయ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డ్రమస్టిక్స్‌ ప్రొడక్షన్స్‌, జీ.స్టూడియోస్‌ సంస్థలు నిర్మించిన ఈ చిత్రానికి శ్యామ్‌ సీఎస్‌ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సత్యవాన్‌ సావిత్రి చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీ రిలీజ్‌ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌ లో నిర్వహించారు. చిత్ర కథానాయకి కీర్తీ సురేష్‌ మాట్లాడుతూ ‘‘ ఇది కోర్టు డ్రామా కథా చిత్రం.ఇందులో ప్రతినాయకుడుగా నటించిన మిష్కిన్‌ తో కలిసి నటించడానికి మొదట కాస్త భయపడ్డాను.రెండు రోజుల తరువాత మిష్కిన్‌ నువ్వు నా కూతురిలా ఉన్నావు అంటూ ఆయన కూతురు ఫొటో చూపించారు. ఆ తరువాత మా ఇద్దరి మధ్య మంచి కాన్వర్సేషన్‌ ఏర్పడింది. ఆయన సినిమా గురించి చాలా విషయాలు చెప్పేవారు. ఆయనకు అనిపించింది మాట్లాడుతారు. నటి రాక్షసుడు. చాలా మంచి వ్యక్తి.దర్శకుడు ప్రవీణ్‌ ఎస్‌.విజయ్‌ నాకు తానా సేర్ద్న కూటం చిత్రం సమయం నుంచి తెలుసు.ఈ చిత్రం కోసం కాళ్లకు చెక్కారు తొడుక్కుని పని చేశారని పేర్కొన్నారు. దర్శక నటుడు మిష్కిన్‌ మాట్లాడుతూ ‘‘నటి కీర్తీ సురేష్‌ డోరోత్తి చిత్రంలో అద్భుతంగా నటించారు. ఆమె పేరు ముందు ఇకపై నడిగైయార్‌ తిలకం అని టైటిల్‌ కార్డులో వేయాలి. అంత గొప్ప నటి ఆమె. ఈ చిత్రంలో ఆమెతో నటించే ముందు నేను తగిన జాగ్రత్తలు తీసుకున్నాను. దర్శకుడు మేం నటించడానికి స్వేచ్ఛ ఇచ్చారు ‘‘ అని పేర్కొన్నారు. కాగా డోరోత్తి చిత్రంలో నటనకు గానూ కీర్తీ సురేష్‌ కు బంగారపుటుంగరాన్ని బహుమతిగా ఇచ్చారు.

కీర్తి సురేష్‌, మిష్కిన్‌ తదితర సత్యవాన్‌ సావిత్రి చిత్ర యూనిట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement