వృషభ వాహనంపై అరుణాచలేశ్వరుడి విహారం | - | Sakshi
Sakshi News home page

వృషభ వాహనంపై అరుణాచలేశ్వరుడి విహారం

Nov 20 2026 1:54 AM | Updated on Nov 20 2026 1:54 AM

వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన గురువారం ఉదయం చంద్రశేఖరుడు అద్దాల పెద్ద వెండి వృషభ వాహనంలో మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వందేళ్లు చరిత్ర కలిగిన 32 అడుగుల ఎత్తు కలిగిన పెద్ద రథానికి కలసం చల్లిన గొడుగును ధరింపజేశారు. సాయంత్రం 6 గంటలకు పెద్ద వృషభ వాహనంలో శివుని చిహ్నంగా గుడ్డతో గొడుగు కప్పి మాడ వీధుల్లో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి పంచమూర్తులకు ప్రత్యేక అలంకరణలు, అభిషేకాలు నిర్వహించి పుష్పలంకరణలో భక్తుల నడుమ మాడ వీధుల్లో ఊరేగించారు. ఉదయం వెండి వృషభ వాహనంలో అన్నామలైయార్‌ సమేద ఉన్నామలై అమ్మవారు ప్రత్యేక అలంకరణల మద్య మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.

నెయ్యి కానుకలు చెల్లించేందుకు

ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు

ఈనెల 24వ తేదీన ఆలయం వెనుక వైపు ఉన్న 2,668 అడుగుల ఎత్తుగల మహా కొండపై సాయంత్రం 6 గంటలకు మహా దీపాన్ని వెలిగించనున్నారు. ఇందుకోసం గాడ గుడ్డతో పాటు నెయ్యిని ఉపయోగించి దీపాన్ని వెలిగించనున్నారు. ఇప్పటికే అవసరమైన నెయ్యిని ఆవీన్‌ పాల డెయిరీ నుంచి కొనుగోలు చేశారు. అయినప్పటికీ భక్తుల నుంచి నెయ్యి కానుకలను స్వీకరించేందుకు ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేసి కానుకలను స్వీకరిస్తున్నారు. భక్తులు ఈ కౌంటర్‌లోనికి వెల్లి మహా దీపం వెలిగించేందుకు అవసరమైన నెయ్యి కానుకలను అందజేయవచ్చు.

అద్దాల వృషభ వాహనంలో ఊరేగుతున్న స్వామి వార్లు, మహా దీపం వెలిగించేందుకు సిద్ధం చేసిన రాగి రాక్షస కొప్పరి, పుష్పాలంకరణలో ఉన్న స్వామి వార్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement