అరికొంబన్‌ చిత్రం ప్రచార టూర్‌ మొదలు | - | Sakshi
Sakshi News home page

అరికొంబన్‌ చిత్రం ప్రచార టూర్‌ మొదలు

Nov 20 2026 1:54 AM | Updated on Nov 20 2026 1:54 AM

అరికొంబన్‌ చిత్రం ప్రచార టూర్‌ మొదలు

తమిళసినిమా: మ్యాజిక్‌ పిక్చర్స్‌ పతాకంపై రూపొందిన చిత్రం అరికొంబన్‌. మిథున్‌ మహేశ్వరన్‌ కథానాయకుడిగా నటించి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. నటి దేవిక కృష్ణన్‌ నాయకిగా నటించిన ఇందులో అజయ్‌ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రంలో అప్పుకుట్టి, ఆడుగళం మురుగదాస్‌ , సుబ్రహ్మణ్యం శివ, ఆధిర, ఎం.రామస్వామి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.సకిష్ణ సేవియర్‌ సంగీతాన్ని, ఆర్‌ ఎస్‌.అనీష్‌ లాల్‌ ఛాయాగ్రహణం అందించారు. ఈ చిత్రం కోసం సంగీత దర్శకులు దేవా జీవీ ప్రకాష్‌ కుమార్‌, వేల్‌ మురుగన్‌, గాయని చిన్మయి పాటలు పాడటం విశేషం. వైవిధ్య భరిత కథాంశంతో రూపొందిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్‌ 11వ తేదీన విడుదల చేస్తున్నట్లు యూనిట్‌ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. దీంతో తమిళనాడు వ్యాప్తంగా చిత్ర ప్రచార కార్యక్రమానికి యూనిట్‌ వర్గాలు శ్రీకారం చుట్టారు. దీంతో ప్రచార బందానికి ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్‌ ధాను బుధవారం స్థానిక టీ.నగర్‌లోని తన కార్యాలయం నుంచి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అరికొంబన్‌ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలుపారు. దీంతో చిత్ర వర్గాలు నిర్మాత కలైపులి ఎస్‌.థానుకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement