దేశీయ టెక్నాలజీతో అరుదైన గుండె శస్త్రచికిత్స | - | Sakshi
Sakshi News home page

దేశీయ టెక్నాలజీతో అరుదైన గుండె శస్త్రచికిత్స

Nov 20 2026 1:54 AM | Updated on Nov 20 2026 1:54 AM

సాక్షి,చైన్నె : రోబోటిక్‌ కార్డియాక్‌ సర్జరీ రంగంలో అరుదైన గుండె శస్త్ర చికిత్స ను విజయవంతంచేసినట్టు ఎస్‌ఎస్‌ఐ మంత్ర సీఈఓ డాక్టర్‌ సుధీర్‌ శ్రీవాస్తవ స్థానికంగా ప్రకటించారు. తమ దేశీయ టెక్నాలజీ సర్జికల్‌ రోబోటిక్‌ సిస్టమ్‌ను ఉపయోగించి, డ్యూయల్‌–కన్సోల్‌,ఫైవ్‌–ఆర్మ్‌ రోబోటిక్‌ బీటింగ్‌–హార్ట్‌ టెకాబ్‌ శస్త్రచికిత్సను నిర్వహించామని వివరించారు. తన పర్యవేక్షణలో, గురుగ్రామ్‌ మేదాంత ఆసుపత్రి అసోసియేట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నితిన్‌ కుమార్‌ రాజ్‌పుత్‌, జైపూర్‌ మణిపాల్‌ ఆసుపత్రి చీఫ్‌ కార్డియాక్‌ సర్జన్‌ డాక్టర్‌ లలిత్‌ మాలిక్‌ ఈ సంక్లిష్ట ఆపరేషన్‌ను నిర్వహించారని తెలిపారు.ఈ విధానంలో సాధారణ బైపాస్‌ సర్జరీలా ఛాతీ ఎముకను కోయాల్సిన అవసరం లేకుండా, కేవలం చిన్న రంధ్రాల ద్వారా ఈ టోటల్లీ ఎండోస్కోపిక్‌ కరోనరీ ఆర్టరీ బైపాస్‌ ప్రక్రియను నిర్వహిస్తారన్నారు. దీనివల్ల శస్త్రచికిత్స కచ్చితత్వంతో జరగడమే కాకుండా, రోగి కేవలం 15 రోజుల్లోనే వేగంగా కోలుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. అలాగే, రెండో సర్జన్‌కు ప్రత్యక్ష శిక్షణ పొందేందుకు కూడా ఈ డ్యూయల్‌–కన్సోల్‌ విధానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆవిష్కరణలు, అత్యుత్తమ సాంకేతికత ద్వారా గుండె వైద్య సేవలను మరింత సులభతరం చేయాలనే తమ నిబద్ధతకు ఈ విజయం నిదర్శనమని ఆస్ప6తి చైర్మన్‌ డాక్టర్‌ నరేష్‌ త్రెహాన్‌ తెలిపారు. మేక్‌ ఇన్‌ ఇండియా, ఫర్‌ ది వరల్డ్‌ దార్శనికతతో ఎస్‌ఎస్‌ ఇన్నోవేషన్స్‌ సంస్థ అభివృద్ధి చేసిన ఎస్‌ఎస్‌ఐ మంత్ర రోబోటిక్‌ సిస్టమ్‌ సామర్థ్యానికి ఇది నిదర్శనమని డాక్టర్‌ సుధీర్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement