ల్యూమెనిస్‌ పల్స్‌ 120 హెచ్‌ లేజర్‌ వ్యవస్థ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

ల్యూమెనిస్‌ పల్స్‌ 120 హెచ్‌ లేజర్‌ వ్యవస్థ ఆవిష్కరణ

Nov 20 2026 1:54 AM | Updated on Nov 20 2026 1:54 AM

సాక్షి, చైన్నె: యూరాలజీ చికిత్సల కోసం మోసెస్‌ 2.0 టెక్నాలజీతో కూడిన నెక్స్ట్‌ –జెన్‌ ల్యూమెనిస్‌ పల్స్‌ 120 హెచ్‌ హోల్మియం లేజర్‌ వ్యవస్థను తమిళనాడులోనే ప్రపథమంగా చైన్నెలో ఆవిష్కరించారు. ఎస్‌ఆర్‌ఎం ప్రైమ్‌ హాస్పిటల్‌ లో ఈ వ్య వస్థను ప్రముఖ తమిళ చిత్రనిర్మాత, నటుడు మి స్కిన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుప త్రి సీఈఓ శివ మాట్లాడుతూ, ప్రోస్టేట్‌ గ్రంథి వాపు , మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రనాళ సంకోచాలు, కణితులు వంటి సమస్యలకు అతి తక్కువ కోతతో (మినిమల్లీ ఇన్వాసివ్‌) చికిత్స అందించేందుకు ఈ హోల్మియం లేజర్‌ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రకటించారు. చుట్టుపక్కల ఉన్న సున్నితమైన కణజాలాలకు ఎటువంటి నష్టం కలగకుండా అదనపు ప్రోస్టేట్‌ కణజాలాన్ని కచ్చితంగా తొలగించడానికి, మూత్రపిండ రాళ్లను సమర్థవంతంగా ముక్కలు చేయడానికి ఇది వీలు కల్పిస్తుందన్నారు. దీనివల్ల శస్త్రచికిత్స సమయంలో రక్తస్రావం బాగా తగ్గడమే కాకుండా, రోగులు త్వరగా కోలుకుని అదే రోజు లేదా మరుసటి రోజే డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. 50 ఏళ్లు పైబడిన పురుషులు మూత్ర సంబంధిత లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా ప్రత్యేక రాయితీ ధరతో ప్రోస్టేట్‌ స్క్రీనింగ్‌ ప్యాకేజీని అందిస్తున్నామన్నారు. ఎస్‌ఆర్‌ఎం ప్రైమ్‌ హాస్పిటల్‌ యూరాలజీ విభాగం సీనియర్‌ కన్సల్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మణికందన్‌, కన్సల్టెంట్‌ డాక్టర్‌ సురేష్‌, మెడికల్‌ సర్వీసెస్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీలేఖ వెంకటేశన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement