మూడోరోజూ సీఎం సమీక్ష | - | Sakshi
Sakshi News home page

మూడోరోజూ సీఎం సమీక్ష

Nov 13 2026 4:05 AM | Updated on Nov 13 2026 4:05 AM

● శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా కార్యాచరణ

సాక్షి, చైన్నె : రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా అధికారులతో సీఎం విజయ్‌ మూడోరోజుగా సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు గత రెండు రోజులుగా సచివాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. మూడవ రోజుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి, పోలీస్‌ డీజీపీ, ఇంటెలిజెన్స్‌ ఐజీ , చైన్నె పోలీస్‌ కమిషనర్‌ లతో సమావేశమైన నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. నేరగాళ్లతో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ సమావేశానంతరం మంత్రి నిర్మల్‌కుమార్‌మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వంపై నిందలు వేయడమే లక్ష్యంగా కుట్రలు జరుగుతున్నాయన్నారు. పోలీసులకు తమ సిఎం పూర్తి స్వేచ్చను ఇచ్చారన్నారు. గత సీఎం స్టాలిన్‌ వలే తమ సీఎం నిద్ర పోవ డం లేదని, ఎక్కడున్నా, నిరంతరం పాలనా వ్యవహారాలపైన ఆయన దృష్టి అని వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీకి గవర్నర్‌..

తమిళనాడులో శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్న వార్తల నేపథ్యంలో, గవర్నర్‌ అర్లేకర్‌ ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సమావేశం కానున్నట్లు సమాచారాలు వెలువడ్డాయి. దీపా వళి సందర్భంగా రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో ఒక స్పెషల్‌ ఎస్‌ఐతో సహా 11 హత్యలు జరగడం, బాలి కల అదృశ్యం వంటి ఘటనలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నివేదికతో ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు గవర్నర్‌ వివరించనున్నారని సమాచారం.

ఎమ్మెల్యేలు, మంత్రులకు విజయ్‌ దిశానిర్దేశం

కొందరు ప్రజాప్రతినిధుల ప్రవర్తనపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో మహాబలిపుంరలోని ఒక హోటల్‌లో టీవీకే ఎమ్మెల్యేలు, మంత్రులతో సీఎం విజయ్‌ సమావేశమయ్యారు. ‘ప్రజలు నా ముఖం చూసి ఓటు వేశారు, మనపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. వివాదాల్లో చిక్కుకోకుండా అందరూ ఐక్యంగా పనిచేయాలి‘ అని సీఎం హెచ్చరించినట్లు సమాచారం. అనవసరంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, నిబంధనలు ఉల్లంఘించి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని ప్రజల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని, ప్రభుత్వ కార్యక్రమాలకు ఎమ్మెల్యేలను తప్పనిసరిగా ఆహ్వానించాలని అధికారులను ఆదేశించి ఉన్నట్టుగా సూచించినట్టు కొందరు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement