మారనున్న 4 రహదారుల రూపురేఖలు | - | Sakshi
Sakshi News home page

మారనున్న 4 రహదారుల రూపురేఖలు

Nov 13 2026 4:05 AM | Updated on Nov 13 2026 4:05 AM

●ప్రభుత్వం నిర్ణయం ●ఆధునిక హంగులు.. మెట్రో కనెక్టివిటీపై స్పెషల్‌ ఫోకస్‌

సాక్షి, చైన్నె: నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించి, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కీలక ప్రణాళికలు సిద్ధం చేసింది. చైన్నెలోని నాలుగు ప్రధాన రహదారులను ఆధునిక పట్టణ రవాణా కారిడార్లుగా తీర్చిదిద్దేందుకు చైన్నె ఇంటిగ్రేటెడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ రంగంలోకి దిగింది.

నాలుగు ప్రధాన రహదారులు ఇవే..

రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, బస్‌ టెర్మినళ్లను కలుపు తూ ప్రయాణికుల చివరి దశ ప్రయాణాన్ని సులభతరం చేసే లక్ష్యంతో నాలుగు రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో తారామణి లింక్‌ రోడ్‌, వాలాజా రోడ్డు, వేలచ్చేరి – తాంబరం రోడ్‌ గ్రాండ్‌ సదరన్‌ ట్రంక్‌ రోడ్‌లు ఉన్నాయి. ఈ రోడ్ల అభివృద్ధికి సంబంధించి వివరణాత్మక ప్రాజెక్ట్‌ నివేదిక తయారీ కోసం క్యాపిటల్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెన్సీ, ఐటెక్‌ లిమిటెడ్‌, టెక్నోజెమ్‌ కన్సల్టెంట్స్‌ , స్వస్తిక్‌ ప్రైమ్‌ కన్సల్టెంట్స్‌ సంస్థలు బిడ్లను సమర్పించాయి. సాంకేతిక, ధరల మూల్యాంకనం అనంతరం అర్హత గల సంస్థకు డీపీఆర్‌ బాధ్యతలను అప్పగించనున్నారు.

బిగ్‌ డేటా అధ్యయనం

41 మెట్రో స్టేషన్ల పరిసరాల్లో బిగ్‌ డేటా సేకరించే దిశగా అధ్యయనం జరగనున్నది. చైన్నె మెట్రో ఫేజ్‌– 1 పరిధిలో పనిచేస్తున్న 41 మెట్రో స్టేషన్ల చుట్టుపక్కల ప్రయాణికుల రవాణా అవసరాలను విశ్లేషించేందుకు కుమ్టా ప్రత్యేక చర్యలు చేపట్టింది.ఇందుకోసం స్ట్రీట్‌ సర్జ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు రూ. 19.75 లక్షల విలువైన కన్సల్టెన్సీ కాంట్రాక్టును 60 రోజుల గడువుతో కేటాయించింది. స్మార్ట్‌ఫోన్‌ యాప్‌లు, మొబైల్‌ నెట్‌వర్క్‌ల ద్వారా సేకరించిన వ్యక్తిగత వివరాలు లేని లొకేషన్‌ డేటా ఆధారంగా ప్రయాణికులు ఏ ప్రాంతాల నుండి మెట్రో స్టేషన్లకు వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారనే దానిపై బిగ్‌ డేటా విశ్లేషణ చేస్తారు. ఈ నివేదిక ఆధారంగా బస్సు సౌకర్యం తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, మెట్రో స్టేషన్లకు అనుసంధానంగా కొత్త ఫీడర్‌ మినీ బస్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement