సాక్షి, చైన్నె: ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ తమిళనాడు రిజిస్ట్రేషన్ల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ 3.0 ప్లాట్‌ఫామ్‌పై కేవలం నాలుగు సులభమైన దశల్లో ప్రజలు నేరుగా ఆన్‌లైన్‌లోనే తమ రిజిస్ట్రేషన్ పత్రాలను సొంతంగా రూపొందించుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను శాఖ గురువారం విడుదల చేసింది.
పేపర్‌లెస్ రిజిస్ట్రేషన్ విధానం ఇలా..
ఖీ ూఖఊఐ ూఉఖీ (ఠీఠీఠీ.్ట ుఽట్ఛజజీ ుఽ్ఛ్ట.జౌఠి.జీ ుఽ) అధికారిక వెబ్‌సైట్ ద్వారా పేపర్‌లెస్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (కాగితరహిత నమోదు విధానం) ఉపయోగించి మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే పత్రాలను సమర్పించవచ్చు.అలాగే, ఆన్‌లైన్‌లో పత్రాలు రూపొందించుకునే దశలను వివరించారు. ముందుగా ఖీ ూఖఊఐ ూఉఖీ వెబ్‌సైట్‌లో సొంత లాగిన్ ఐడీ సృష్టించుకుని, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ ఏ రకమైన పత్రం కావాలో ఎంచుకుని.. అమ్మకందారుడు, కొనుగోలుదారుడు (లేదా రుణగ్రహీత), సాక్షుల వివరాలు , ఆస్తి సమాచారాన్ని పూరించి సమర్పించాలి. వెంటనే ఒక డీపీ నంబర్ జారీ అవుతుంది. ఆ పత్రాన్ని సరిచూసుకుని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ’పే ఆన్‌లైన్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ రుసుమును చెల్లించాలి. అనంతరం కాగితరహిత నమోదు కోసం డ్రాఫ్ట్ డాక్యుమెంట్ సమ్మరీని ఎంచుకుని, గతంలో వచ్చిన డీపీ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా తుది పత్రాన్ని రూపొందించాలి.
ఇ–సైన్ – టోకెన్ బుకింగ్..
సంబంధిత వ్యక్తులు ఓటీపీ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ–సంతకం పూర్తి చేయాలి. ఆ తర్వాత తమకు అనుకూలమైన తేదీ, సమయాన్ని ఎంచుకుని ముందస్తు టోకెన్ బుక్ చేసుకోవాలి. కేటాయించిన సమయానికి అమ్మకందారుడు, కొనుగోలుదారుడు , సాక్షులు సంబంధిత సబ్–రిజిస్ట్రార్ కార్యాలయానికి హాజరుకావాలి. అక్కడ అధికారులు చిరునామా ఽధ్రువీకరణ, ఈ–సంతకం ప్రక్రియ పూర్తి చేసి రిజిస్టర్ అయిన పత్రాన్ని అందిస్తారు.


