– మద్రాస్ హైకోర్టులో పిల్ దాఖలు
సాక్షి, చైన్నె: తమిళనాడులోని గ్రామ పంచాయతీల ఐదేళ్ల పదవీకాలం ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా, వాటి నిర్వహణను ప్రత్యేక అధికారులక అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలైంది. చెంగల్పట్టు జిల్లాకు చెందిన న్యాయవాది ఆర్. భాస్కరన్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. సకాలంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి నిర్దిష్టమైన కాలపరిమితిని ఖరారు చేసేలా తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243– ఈ ప్రకారం పంచాయతీల పదవీకాలం 5 సంవత్సరాలు మాత్రమేనని, ఆ గడువు ముగియక ముందే తదుపరి స్థానిక సంస్థలను ఏర్పాటు చేయడానికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని పిటిషనర్ స్పష్టం చేశారు. అడ్మినిస్ట్రేటివ్ సాకులు చెబుతూ రాజ్యాంగబద్ధమైన హామీని ప్రభుత్వం ఉల్లంఘించకూడదని పేర్కొంటూ, అక్టోబర్ 19న గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ జారీ చేసిన జీవోను తక్షణమే రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత పంచాయతీ రాజ్ చట్టంలో ముందస్తుగా ఎలాంటి సవరణలు చేయకుండా ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించే అధికారం ఉందా లేదా అని పిటిషనర్ సవాలు చేశారు.
వార్డుల పునర్విభజన సాకు చెల్లదు
వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పెండింగ్‌లో ఉందనే సాకుతో ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని వాయిదా వేయడం చట్టబద్ధంగా సమర్థనీయం కాదని.. వివాదాలు, సమస్యలు ఉన్న ప్రాంతాల్లో మినహా, మిగిలిన చోట్ల తక్షణమే ఎన్నికలు జరపాలని కోరారు. కోర్టు పర్యవేక్షణలోనే నిర్దిష్ట గడువులోగా ఈ పనులు పూర్తి చేయాలని కోరారు.
ఆరుగురు జాయింట్ కమిషనర్ల ఆకస్మిక బదిలీ సాక్
సాక్షి, చైన్నె : దేవాదాయ శాఖలో కీలక పరిపాలనా మార్పులు చోటుచేసుకున్నాయి. శాఖ పరిధిలోని ఆరుగురు జాయింట్ కమిషనర్లను (సంయుక్త కమిషనర్లు) ఆకస్మికంగా బదిలీ చేశారను. అలాగే, గతంలో ఇచ్చిన పలు నియామక ఉత్తర్వులను రద్దు చేస్తూ దేవాదాయ శాఖ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులందరూ ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే తమకు కేటాయించిన కొత్త బాధ్యతలను స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది.
బదిలీ –నియామకం
తిరువేర్కాడు కరుమారి అమ్మన్ ఆలయ జాయింట్ కమిషనర్ కె రామును చెఉన్నై –1 జోన్ జాయింట్ కమిషనర్‌గా నియమించారు. ఇక్కడ ఇదివరకు జారీ చేసిన పి. విజయ నియామకం రద్దు చేశారు. మదురై జోన్ జాయింట్ కమిషనర్‌గా రేణుకా దేవి నాయమాకాన్ని రద్దు చేస్తూ, ఆమెను తిరువేర్కాడు కరుమారి అమ్మన్ ఆలయ జాయింట్ కమిషనర్‌గా నియమించారు. కాంచీపురం జాయింట్ కమిషనర్ డి అనిత పోస్టింగ్ ఉత్తర్వుల ను రద్దు చేస్తూ, ఆమెను తాజాగా చైన్నె జోన్ 3 జా యింట్ కమిషనర్‌గా నియమించారు. ఇక్కడున్న కె.రమణి నియమాకాన్ని రద్దు చేసి, దేవాదాయ శాఖ వెరిఫికేషన్ డివిజన్ జాయింట్ కమిషనర్‌గా బదిలీ చేశారు.వచైన్నె జోన్ –1లో ఉన్న పి.విజయ నియామకం రద్దు కావడంతో, ఆమెను తిరువణ్ణామలై జోన్ జాయింట్ కమిషనర్‌గా నియమించా రు.వెరిఫికేషన్ డివిజన్‌లోని సి.కుమారదురై నియా మకాన్ని రద్దు చేసి, కాంచీపురం ప్రాంతీయ జా యింట్ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు.
పట్టణాభివృద్ధికి రూ.377 కోట్లు
– 2,880 అభివృద్ధి పనులకు పరిపాలనా ఆమోదం
సాక్షి, చైన్నె : తమిళనాడు వ్యాప్తంగా ఉన్న పట్టణ స్థానిక సంస్థల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. సీఎం సమీకృత పట్టణాభివృద్ధి మిషన్ కింద రూ. 376.65 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 2,880 అభివృద్ధి ప్రాజెక్టు పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు చైన్నె కార్పొరేషన్‌లో రూ. 138 కోట్ల వ్యయంతో 680 పనులు చేపట్టనున్నారు. పచ్చదనం, ఆహ్లాదం పెంచేందుకు రూ. 34.46 కోట్లతో 36 కొత్త పార్కుల నిర్మాణంకు నిర్ణయించారు. క్రీడా రంగాన్ని ప్రోత్సహించడానికి రూ. 9.52 కోట్లతో 11 కొత్త క్రీడా మైదానాల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ఇతర కార్పొరేషన్లు – మునిసిపాలిటీలులో రూ. 154 కోట్ల అంచనా వ్యయంతో 1,513 ప్రాజెక్టులు ఆమోదం లభించింది. పట్టణ పంచాయతీలులలో రూ. 84.49 కోట్ల వ్యయంతో 687 అభివృద్ధి పనులు. నిర్ణయించారు. రియల్–టైమ్ మోనిటరింగ్ సిస్టమ్ – పౌర సేవల్లో విప్లవాత్మక మార్పుల దిశగా ముందుకెళ్లనున్నారు. ఇందులో భాగంగదా పట్టణ స్థానిక సంస్థల్లో కీలకమైన పౌర సేవల పర్యవేక్షణ కోసం పురపాలక పరిపాలనా శాఖ ఒక రియల్–టైమ్ పర్యవేక్షణ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రానున్నారు. అలాగే నీటి సరఫరా, మురుగునీటి పారుదల, చెత్త సేకరణ, పడేయడం సేవలను ఒకే నియంత్రణ గది ద్వారా నిరంతరం పర్యవేక్షి ంచనున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రాకముందే సమస్యలను గుర్తించి, క్షేత్రస్థాయిలో తక్షణమే పరిష్కరించేలా ఈ సిస్టమ్ డిజైన్ చేయబడుతోంది. దీని కోసం సిస్టమ్ కోఆర్డినేటర్ ఎంపికకు టెండర్లు ఆహ్వానించినట్లు అధికారులు తెలిపారు.


