– తొలిసారిగా జర్నలిస్టుకు అవకాశం
సాక్షి, చైన్నె: తమిళనాడు రాష్ట్ర సమాచార కమిషన్‌కు కొత్త సారథి ఖరారయ్యారు. మాజీ ప్రధాన సమాచార కమిషనర్ షకీల్ అక్తర్ పదవీకాలం ఇటీవల ముగియడంతో, ఆయన స్థానంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎస్. నటరాజన్‌ను కొత్త ప్రధాన సమాచార కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయనతో పాటూ మరో నలుగురు కొత్త సమాచార కమిషనర్లను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర మానవ వనరుల నిర్వహణ శాఖ కార్యదర్శి సి. సమయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు కొత్త కమిషనర్‌గా విశ్రాంత ఐఎఎస్ ఎస్ నటరాజన్ నియమితులయ్యారు. కొత్త సమాచార కమిషనర్లుగా నలుగుర్ని నియమించారు. వీరిలో ఎస్. మహాలక్ష్మి, డి.కె. షబీర్ సి.పి. మీనా, పి. మహాలింగం (సీనియర్ జర్నలిస్ట్) ఉన్నారు. తమిళనాడు రాష్ట్ర సమాచార కమిషనర్‌గా ఒక పాత్రికేయుడిని (పి. మహాలింగం) నియమించడం రాష్ట్ర చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం విశేషం. రాష్ట్ర గవర్నర్ ఆర్.వి. ఆర్లేకర్ ప్రభుత్వ సిఫార్సుల మేరకు ఈ నియామకాలను ఖరారు చేశారు. కొత్తగా నియమితులైన కమిషనర్లు 3 సంవత్సరాల పాటు పదవుల్లో కొనసాగుతారు.


