అక్రమ సంబంధం వ్యవహారంలో యువకుడి హత్య | - | Sakshi
Sakshi News home page

అక్రమ సంబంధం వ్యవహారంలో యువకుడి హత్య

Nov 1 2026 4:37 AM | Updated on Nov 1 2026 4:37 AM

● మృతదేహాన్ని పొన్నేరి వద్ద

వెలికితీసిన కడలూరు పోలీసులు

తిరువళ్లూరు: సినీనటి రాధిక ఇంట్లో పని చేసే మహిళ కుమారుడ్ని కడలూరు నుంచి చైన్నెకు తీసుకొచ్చి పొన్నేరి సమీపంలోని బీచ్‌లో హత్య చేసి పాతి పెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటనపై కడలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని శనివారం ఉదయం మృతదేహాన్ని వెలికితీసి సొంత గ్రామానికి తరలించారు. కడలూరు జిల్లా శిరువత్తూరు గ్రామానికి చెందిన ఎయిల్‌సెల్వి. ఇతని కుమారుడు ప్రశాంత్‌(19). ఎయిల్‌సెల్వి చైన్నెలోని నటి రాధిక ఇంట్లో పనిమనిషిగా పని చేస్తున్నారు. ప్రశాంత్‌ కడలూరులో స్థానికంగా నివాసం వుంటూ, తన మేనమామ రమేష్‌తో కలిసి టైల్స్‌ అతికించే పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత 27న కడలూరు నుంచి చైన్నెలో వుంటున్న తన తల్లి వద్దకు వెళ్తున్నట్టు మేనమామ వద్ద చెప్పి బయలుదేరిన ప్రశాంత్‌ అతరువాత అదృశ్యమయ్యాడు. ఈ ఘటనపై రమేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కడలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ప్రశాంత్‌కు అదే గ్రామానికి చెందిన దేవరాసు భార్యతో ప్రశాంత్‌ అక్రమ సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. విషయయం దేవరాసుకు తెలిసి పలుమార్లు హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో ప్రశాంత్‌ను చైన్నెకు పిలిపించి, అక్కడ మద్యం పోసి దేవరాసు తన స్నేహితుడైన దినేష్‌తో కలిసి హత్య చేసి పొన్నేరి సముద్రతీర ప్రాంతాల్లో పాతిపెట్టినట్టు నిర్ధారించారు. అనంతరం దేవరాసును కడలూరు నుంచి పొన్నేరికి తీసుకొచ్చి ప్రశాంత్‌ మృతదేహాన్ని వెలికితీసి పంచనామ నిర్వహించిన తరువాత సొంత గ్రామానికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement