వేలూరు: లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకొని పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కారం చేసుకోవాలని జిల్లా న్యాయమూర్తి ఇళవరసన్ అన్నారు. వేలూరు కోర్టు ఆవరణంలో అవగాహణ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ ఒకటివ తేది నుంచి డిసెంబర్ 31వ తేది వరకు పెండింగ్‌లో ఉన్న పలు కేసులను స్నేహ పూర్వకంగా పరిష్కారం చేసుకునేందుకు ప్రత్యేక సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కేసులకు వీటిలో పరిష్కారం వచ్చే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి శాండిల్వాన్, న్యాయమూర్తులు గోకుల క్రిష్ణన్, రాధాక్రిష్ణన్, న్యాయ కళాశాల విద్యార్థులు, న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ అవగాహణ ర్యాలీ కోర్టు ఆవరణం నుంచి వేలూరు కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా ప్రజలకు కరపత్రాలు అందజేసి అవగాహన కల్పించారు.


