రూ. 2 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

రూ. 2 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం స్వాధీనం

Oct 1 2026 4:58 AM | Updated on Oct 1 2026 4:58 AM

పళ్లిపట్టు: పొదటూరుపేటలో ఆక్రమణకు గురైన రూ.రెండు కోట్లు విలువైన ప్రభుత్వ స్థలాన్ని రెవిన్యూ శాఖ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పళ్లిపట్టు సమీపంలోని పొదటూరుపేట భారతీయార్‌నగర్‌ నల్లతన్నీర్‌కులం వీధిలోని ప్రభుత్వ పోరంబోకు స్థలం కొందరు ఆక్రమించి ప్లాట్లు వేసేందుకు పథకం పన్నుతుననట్లు జిల్లా కలెక్టర్‌ కవితకు ఫిర్యాదులు అందాయి. కలెక్టర్‌ ఆదేశాల మేరకు పళ్లిపట్టు తహసీల్దారుతో పాటు ఆర్‌ఐ, వీఆర్వో, సర్వేయర్లు బుధవారం సర్వే చేశారు. దీంతో దాదాపు నాలుగు ఎకరాల పోరంబోకు స్థలం ఆక్రమణకు గురియైనట్లు గుర్తించారు. వెంటనే ప్రభుత్వ పోరంబోకు స్థలంలో నోటీస్‌ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వ స్థలం ఆక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు ఏర్పాటు చేశారు. స్వాధీనం చేసిన ప్రభుత్వ స్థలం మార్కెట్‌ విలువ రూ. రెండు కోట్లు అని రెవెన్యూ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement