తిరుత్తణి: టాస్మాక్ దుకాణం తొలగించాలనే డిమాండ్‌తో పురట్చి భారతం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. తిరువలంగాడు యూనియన్‌లోని చినమ్మపేట రైల్వే స్టేషన్‌కు సమీపంలో ప్రభుత్వ టాస్మాక్ మధ్యం దుకాణం వుంది. రైల్వే స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లు ప్రయాణికులు, ప్రజలు మద్యం షాపు వద్ద మందుబాబుల ఆగడాలతో ఇబ్బందులు చెందుతున్నారు. రైల్వే స్టేషన్ ఇళ్ల పరిసర ప్రాంతంలోని మద్యం దుకాణం తొలగించాలనే డిమాండ్‌తో పురట్చి భారతం ఆధ్వర్యంలో మద్యం షాపు వద్ద ధర్నా చేపట్టారు. వందకు పైబడిన ఆ పార్టీ శ్రేణులు, మహిళలు పాల్గొన్న ధర్నాలో పురట్చి భారతం పార్టీ యువజన విభాగ నాయకుడు మహా పాల్గొని ప్రసంగించారు. ప్రయాణికులు, మహిళలు, విద్యార్ధులకు ఇబ్బందిగా మారిన చినమ్మపేటలోని టాస్మాక్ దుకాణం తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటం తీవ్రం చేస్తామని హెచ్చరించారు.


