ధర్మన్‌లో శ్రీలీల ఐటమ్‌ సాంగ్‌? | - | Sakshi
Sakshi News home page

ధర్మన్‌లో శ్రీలీల ఐటమ్‌ సాంగ్‌?

Oct 1 2026 4:58 AM | Updated on Oct 1 2026 4:58 AM

తమిళసినిమా: సినిమాల్లో ఒకప్పుడు ఐటమ్‌ సాంగ్స్‌ గా పేర్కొన్నవి ఇప్పుడు ప్రత్యేక పాటలు రూపాంతరం చెందాయి. అయితే నృత్య రీతుల్లో మాత్రం మార్పు ఉండటం లేదు. అదే అంగాంగ ప్రదర్శనలు, కురస దుస్తులు దర్శనం ఇస్తున్నాయి. అంతే కాకుండా అలాంటి పాటల్లో నటించే వారి నుంచి అందాలారబోతల్లో తప్పేముంది అనే భావన వ్యక్తం అవుతోంది. అలా ప్రముఖ కథానాయికలు కూడా ఐటమ్‌ సాంగ్స్‌ నటించడానికి సై అంటున్నారు. ఇకపోతే నటుడు రజనీకాంత్‌ నటిస్తున్న చిత్రాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ తప్పనిసరి అవుతున్నాయి. అందుకు కారణం ఆయన చిత్రాల విజయానికి అలాంటి పాటలు పక్క బలంగా మారడమే ననే సమాధానం కోలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తోంది. అందుకు. చిన్న ఉదాహరణ జైలర్‌ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన నువ్వు కావాలయ్యా పాట సృష్టించిన సంచలనమే. ఆ తరువాత రజనీకాంత్‌ నటిస్తున్న ప్రతి చిత్రంలోనూ ఐటమ్‌ పాట తప్పని సరిగా మారింది. కూలీ చిత్రంలో మోనికా అంటూ సాగే పాటలో పూజా హెగ్డే నటించారు. త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న జైలర్‌ 2 చిత్రంలో నటి పూర్ణ ప్రత్యేక పాటలో నటించారు. కాగా ఇప్పుడు నటి శ్రీలీల వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్‌ ప్రస్తుతం ధర్మన్‌ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నటుడు కమలహాసన్‌ తన రాజ్‌ కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి అశ్వద్‌ మారి ముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటికి మూడు షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. కాగా ధర్మన్‌ చిత్రంలో కూడా ఒక ఐటమ్‌ సాంగ్‌ చోటు చేసుకుందని, ఈ పాటలో క్రేజీ కథానాయకి శ్రీ లీలను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కోలీవుడ్లో టాక్‌ చక్కర్లు కొడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement