ఈ విషయం నా ఒక్కడిదే కాదు | - | Sakshi
Sakshi News home page

ఈ విషయం నా ఒక్కడిదే కాదు

Oct 1 2026 4:58 AM | Updated on Oct 1 2026 4:58 AM

తమిళసినిమా: కథానాయకుడు, కథ, కథనం, మాటలు, పాటలు, సంగీతం, దర్శకత్వం అంటూ అష్టావధానాలు నిర్వహించి హిప్‌ హాప్‌ ఆది తెరకెక్కించిన తాజా చిత్రం మీపై మురుక్కు 2. అవ్నీ మూవీస్‌, బెంజ్‌ మీడియా సంస్థల అధినేతలు నటి కుష్బూ సుందర్‌,ఏసీఎస్‌.అరుణ్‌ కుమార్‌ కలిసి నిర్మించిన ఇందులో నటి కేటిక శర్మ, చైత్ర జె ఆచార్‌ రమ్యా రంగనాధన్‌ హీరోయిన్లుగా నటించగా, నటుడు కరుణాస్‌, నాజర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సంగీతం ప్రధాన ఇతివృత్తంగా రూపొందిన మీసై మురుక్కు 2 చిత్రం ఈ నెల 25వ తేదీన విడుదలై ప్రేక్షకాదరణ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.దీంతో చిత్ర యూనిట్‌ మంగళవారం సాయంత్రం చైన్నెలోని ఓ హోటల్లో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఇది పూర్తిగా హిప్‌ హాప్‌ ఆది సక్సెస్‌ అని దర్శకుడు సుందర్‌ సి పేర్కొన్నారు. అతను తన చుట్టూ ఉన్న వారు కూడా ఎదగాలని భావించే వ్యక్తి అని ప్రశంసించారు. దర్శక, నటుడు హిప్‌ హాప్‌ ఆది మాట్లాడుతూ తాను ఇండిపెండెంట్‌ మ్యూజికల్‌ ఆల్బమ్స్‌ చేసుకుంటున్న తరుణంలో దర్శకుడు సుందర్‌ సి తన ఆల్బమ్స్‌ చూసి సంగీత దర్శకుడిగా అవకాశం కల్పించారన్నారు. ఆ తరువాత మీసై మురుక్కు చిత్రానికి దర్శకుడిగా పరిచయం చేశారన్నారు.ఆరన తనపై ఉంచిన నమ్మకం ఈ మీసై మురుక్కు – 2 సక్సెస్‌ అన్నారు.అయితే ఈ విజయం యూనిట్‌ సభ్యులందరిదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన గానా కళాకారులను ప్రోత్సహించే విధంగా గానా గ్యాంగ్‌ అనే సంస్థను ప్రారంభించారు. దీని లోగోను ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ సంగీత దర్శకుడు దేవా చేతులు మీదుగా ఆవిష్కరింపజేశారు. ఆయన తొలి ప్రయత్నంగా ముగ్గురు గానా కళాకారులను పరిచయం చేశారు. ఇకపై గానా గ్యాంగ్‌ పేరుతో సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు హిప్‌ హాప్‌ ఆది తెలిపారు.కాగా ఈ చిత్ర నిర్మాత, నటి కుష్బూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఆమె పుట్టిన రోజు సందర్భంగా కేక్‌ కట్‌ చేసి. శుభాకాంక్షలు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement