సాక్షి, చైన్నె: తమిళనాడు రాష్ట్రంలో బ్యాంకింగ్ రంగం పురోగతిని, జూన్ 2026 నాటికి సాధించిన పనితీరును సమీక్షించేందుకు 187వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం చైన్నెలో జరిగింది. రుణాలు, ఆర్థిక అంశాలు, ప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలుపై ఈ సమావేశంలో వివరంగా చర్చించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఎం. ఎ. సిద్ధిక్ మాట్లాడు తూ, వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా కిసాన్ క్రెడి ట్ కార్డ్, ఓఇఇ డెయిరీ రుణాలు, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, ఫుడ్ ప్రాసెసింగ్ రుణాలను మరింత ఎక్కువగా మంజూరు చేయాలని ప్రాధాన్యతనిచ్చారు. అలాగే, ఎంఎస్‌ఎంఈ విభాగంలో కొత్త పారిశ్రామికవేత్తల కోసం మోడల్ ప్రాజెక్ట్‌లను రూపొందించి, బ్యాంకులతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖలు వారికి అవసరమైన మార్గదర్శకత్వం, సాయం అందించాలని కోరారు. ఈ సమావేశానికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ధనరాజ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (తమిళనాడు – పుదుచ్చేరి) రీజినల్ డైరెక్టర్ వై. జయకుమార్ – రీజినల్ డైరెక్టర్, నాబర్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ హెచ్. మనోజ్ –, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ జీఎం వేలాయుధం ,ఇతర ప్రభుత్వ విభా గాలు, ఆర్‌బీఐ, నాబార్డ్ సీనియర్ అధికారులు, సభ్య బ్యాంకుల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు మరియు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్లు హాజరయ్యారు.వ్యవసాయం, డెయి రీ అనుబంధ రంగాలు, సూక్ష్మ–చిన్న–మధ్య తరహా పరిశ్రమలు, విద్యుత్,విద్యా రుణాలు మరియు గృహ రుణాల పురోగతిని సమీక్షించారు. ప్రభుత్వ ప్రాయోజిత సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో అందేలా రుణ ప్రక్రియలను వేగవంతం చేయా లని నిర్ణయించారు.: సుస్థిర ఆర్థిక ప్రగతిని సాధించేందుకు గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకింగ్ సేవలను, రుణ సౌకర్యాలను మరింత బలోపేతం చేసేందుకు నిర్ణయంచారు.


