మేనమామ బంగారు ఉంగరం పథకానికి సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

మేనమామ బంగారు ఉంగరం పథకానికి సర్వం సిద్ధం

Sep 28 2026 7:45 AM | Updated on Sep 28 2026 7:45 AM

● నేడు మదురైలో ప్రారంభించనున్న సీఎం విజయ్‌

సాక్షి, చైన్నె: సీఎం విజయ్‌ మదురైలో పర్యటించి, ప్రతిష్టాత్మక తాయ్‌ మామన్‌ తంగ మొదిరం (మేనమామ బంగారు ఉంగరం) పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికార వర్గాలు సర్వం సిద్ధం చేశాయి. ఎన్నికల వాగ్దానం మేరకు దశల వారీగా పథకాలను సీఎం విజయ్‌ ప్రభుత్వం అమలుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం బంగారు ఉంగరం పథకం అమలులోకి రానున్నది. ప్రభుత్వ ఆస్పత్రులలో పుట్టే బిడ్దలకు ఈ పథకం వర్తింప చేసే రీతిలో చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం విమానంలో చైన్నె నుంచి మదురై చేరుకోనున్న సీఎం విజయ్‌, ముందుగా ప్రసిద్ధ మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మదురై ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రికి చేరుకుని తాయ్‌ మామన్‌ బంగారు ఉంగరం పథకాన్ని ప్రారంభిస్తారు. అక్కడ ప్రసూతి వార్డును సందర్శించి, జన్మించిన 25 మంది నవజాత శిశువులకు ఉంగరాలను స్వయంగా తొడిగి పథకానికి శ్రీకారం చుడతారు. ఒక్కో బిడ్డకు ఒక గ్రాములో ఈ ఉంగరం అందజేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం విజయ్‌ కొత్తగా ఏర్పాటు చేసిన గాంధీ అరుంగల్‌ను కూడా ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా మదురైలో 4 వేల మంది పోలీసు సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement