మాజీ మంత్రి దురై మురుగన్, వీఐటీ చాన్సలర్ విశ్వనాథన్ సోదరుల పుస్తకం సెయియన్ పుస్తకావిష్కరణ
వేలూరు: రాజకీయాలు ఎన్ని వచ్చినా మాజీ మంత్రి దురై మురుగన్‌తో స్నేహం వీడిపోదని వీఐటీ యూనివర్సిటీ చాన్సలర్ విశ్వనాథన్ అన్నారు. వేలూరు వీఐటీ యూనివర్సిటీ ఆవరణలో శుక్రవారం వీఐటీ, నావలర్ సెయియన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చాన్సలర్ విశ్వనాథన్ రాసిన సాధన సోదరుల పుస్తకం సెయియన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇందులో మాజీ మంత్రి దురై మురుగన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చాన్సలర్ విశ్వనాథన్ మాట్లాడుతూ సెయియన్ ఆరేళ్లపాటు పాటు వీఐటీ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్‌గా పనిచేశారని తెలిపారు. తాను లయోలా కళాశాల, మాజీ మంత్రి దురై మురుగన్ పచ్చయప్పన్ కళాశాల ఆధ్వర్యంలో వక్తృత్వ పోటీల్లో కలుసుకున్నామన్నారు. రాజకీయాల్లో పలు మార్పులు జరిగినప్పటికీ తమ స్నేహం మాత్రం కొనసాగుతోందన్నారు. 1975లో తాను డీఎంకే నుంచి అన్నాడీఎంకేలో చేరానని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ మృతి చెందిన సమయంలో తాను అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శిగా పనిచేశానని తెలిపారు. దురై మురుగన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయనకు తాను అభినందనలు తెలిపానని వెల్లడించారు. తాను ప్రతిపక్ష పార్టీలో ఉన్నందున ఆ సమయంలో వీటిపై పలు విమర్శలు వచ్చిందన్నారు. తమిళనాడులో భారతిదాసన్ కవితలను బయటకు చెప్పిన వారు నావలర్ తెలిపారు. 1954లో మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై వేలూరుకు వచ్చారని తెలిపారు. ఆయన కోట మైదానంలో ఉన్న గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారని, దీన్ని కాంగ్రెస్ పార్టీ వారు వ్యతిరేకించారని తెలిపారు. అన్నా మాట్లాడుతూ రాజకీయాల్లో నాగరికతను తెలుసుకోవాలని తెలిపారు. 1959లో అన్నాదురై సెరియర్‌ను ప్రధాన కార్యదర్శి పార్టీకి పిలిపించారన్నారు. డీఎంకే ప్రారంభించిన సమయంలో తన లాంటి వారు అనేక మంది యువకులే ఉన్నారని తెలిపారు. 1985లో వీఐటీ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన వారు నావలర్ అని తెలిపారు. మాజీ మంత్రి దురై మురుగన్ మాట్లాడుతూ సమావేశంలో తాను ఏ విధంగా మాట్లాడాలనే విషయాలను తెలియజేసిన వ్యక్తి నావలర్ అన్నారు. అన్నాదురై వద్ద ఉన్న వ్యక్తుల్లో నావలర్ ఒకరు అయితే, ప్రొఫెసర్ అన్బయగన్ రెండవ వ్యక్తి అన్నారు. నావలర్ రాజకీయాలకు వచ్చి ఉంటే ఉన్నత శిఖరాలకు వెళ్లి ఉంటారని తెలిపారు. ఆయన కఠినమైన నిబంధనలు పెట్టడంతో ఎమ్మెల్యేలు వ్యతిరేకించారని తెలిపారు. యువకుల గురించి రాసిన పుస్తకాలను ప్రతి ఒక్కరూ చదివి తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో నావలర్ సెయియన్ కుటుంబ సభ్యులతో పాటు, వీఐటీ ఉపాధ్యక్షుడు శంకర్ విశ్వనాథన్, మేయర్ సుజాత, మాజీ వైస్ చాన్సలర్ సభాపతి మోహన్, ప్రొఫెసర్ వీరపాండియన్ తదితరులు పాల్గొన్నారు.


