అల్పాహారం తిన్న విద్యార్థులకు అస్వస్థత | - | Sakshi
Sakshi News home page

అల్పాహారం తిన్న విద్యార్థులకు అస్వస్థత

Sep 26 2026 7:35 AM | Updated on Sep 26 2026 7:35 AM

సేలం: అల్పాహారం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. నామక్కల్‌ జిల్లాలోని తిరుచెంగోడ్‌ సమీపంలో ఉన్న మల్లసముద్రం ప్రభుత్వ బాలుర ఉన్నత మాధ్యమిక పాఠశాలలో 6 నుండి 8వ తరగతి వరకు 195 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి తమిళనాడు ప్రభుత్వం కామరాజ్‌ అల్పాహార పథకం కింద అల్పాహారం అందిస్తోంది. శుక్రవారం ఉదయం 110 మంది విద్యార్థులకు మహిళా స్వయం సహాయక బృందానికి చెందిన కోకిల, సత్య సేమియా కిచిడీని వండి పెట్టారు. దాన్ని తిన్న ఎనిమిదో తరగతి విద్యార్థులు వినీత్‌, సందీష్‌, సంతోష్‌, రోహిత్‌ శర్మ, యువన్‌, ఏడో తరగతి విద్యార్థులు రోహిత్‌, దిలీప్‌, తమిళ ఇనియన్‌, ధర్మేష్‌, సుజిత్‌, ఆరో తరగతి విద్యార్థులు మొత్తం 14 మందికి కడుపునొప్పి వచ్చింది. వాంతులు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ప్రధానోపాధ్యాయుడు మాణిక్యం విద్యార్థులను అంబులెన్స్‌లో మల్లసముద్రం ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు పంపించారు. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా తెలియజేశారు. జిల్లా వైద్య అధికారి ప్రసాద్‌ ఆదేశాల మేరకు, ప్రధాన వైద్యుడు తమిళినియన్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షలు చేశారు. 10 మందికి పైగా విద్యార్థులకు గ్లూకోజ్‌ ఇచ్చి రక్త నమూనాలు సేకరించారు. విరేచనాలు అవుతున్న విద్యార్థుల మల నమూనాలను తీసుకున్నారు. ఆహార భద్రతా విభాగం అధికారి, ఆహారం, రక్తం, మల నమూనాలను పరీక్ష కోసం సేలం తీసుకువెళ్లి అందజేశారు. గ్లూకోజ్‌, మందులు తీసుకున్న విద్యార్థులు కోలుకున్న వెంటనే వారి తల్లిదండ్రులతో పాటు ఇళ్లకు పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement