సాక్షి,చైన్నె: ప్రస్తుతం బంగారంతో సమానంగా వెండికి గిరాకీ పెరుతోందని సిల్వర్ స్టోర్ డైరెక్టర్లులో ఒకరైన నిఖిల్ జైన్ తెలిపారు. చైన్నె రిటైల్ రంగంలో తన ఉనికిని బలోపేతం చేసుకున్న సిల్వర్ స్టోర్‌ను విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం చైన్నె మడిపాక్కంలో స్విల్వర్ స్టోర్ షోరూమ్‌ను ప్రారంభించారు. ఇందులో ఆ సంస్థ డైరెక్టర్లు నిఖిల్ జైన్, అభిషేక్, భరత్ లోథా మాట్లాడుతూ సిల్వర్ స్టోర్ చైన్నె విస్తరణలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని తెలిపారు. దీంతో దక్షిణ చైన్నెలోని వినియోగదారులకు తన వెండి ఉత్పత్తుల సేకరణ మరింత చేరువగా చేసిందని తెలిపారు. కొత్త అవుట్‌లెట్‌లో విస్తృత శ్రేణిలో వెండి వస్తువులు, వెండి పాత్రలు, వెండి ఆభరణాలు, కాలి గొలుసులు, 999 స్వచ్ఛత గల వెండి నాణేలు, వెండి కడ్డీలు లభిస్తాయని తెలిపారు. ఈ ప్రారంభోత్సవంతో పాటు వినియోగదారుల కోసం ప్రత్యేక పరిచయ ఆఫర్లను కూడా అందిస్తున్నారని అన్నారు. వెండి వస్తువులు, ఎంపిక చేసిన ఉత్పత్తులపై గ్రాముకు రూ.10 తగ్గింపును, అలాగే 999 స్వచ్ఛత గల వెండి నాణేలు, కడ్డీలపై గ్రాముకు రూ.5 తగ్గింపును అందిస్తున్నామన్నారు.


