ప్రతినాయకిగా నటించడానికై నా రెడీ | - | Sakshi
Sakshi News home page

ప్రతినాయకిగా నటించడానికై నా రెడీ

Sep 19 2026 4:20 AM | Updated on Sep 19 2026 4:20 AM

తమిళ సినిమా: కథానాయకిగా దక్షిణాదిలో ఎదుగుతున్న నటి భాగ్యశ్రీ భోర్సే. ఈ మరాఠీ బ్యూటీ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చదివి మోడలింగ్‌ రంగంలోకి ప్రవేశించారు. అలా సినిమాల్లో పాటించవచ్చుగా అని స్నేహితులు, సన్నిహితులు సూచించగా అవకాశాలు వచ్చినప్పుడు చూద్దాంలే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు ఇటీవల ఒక భేటీలో భాగ్యశ్రీ భోర్సే పేర్కొన్నారు. తెలుగులో బచ్చన్‌ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత అక్కడ కొన్ని చిత్రాల్లో నటించారు. ఆ తరువాత కాంత చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయ్యారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయినా భాగ్యశ్రీ భోర్సే నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీని గురించి ఆమె ప్రస్తావిస్తూ ఆ చిత్రంలో నటనను మహానటి చిత్రంలో కీర్తి సురేష్‌ నటనతో పోల్చారనీ, బహుశా ఈ రెండు చిత్రాలు 1980–90 కాలానికి చెందిన కథలతో రూపొందినవి కావడమే కావచ్చునన్నారు. ఇటీవల తెలుగులో ఈమె నటించిన లెనిన్‌ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా సెయోన్‌ చిత్రంలో నటిస్తున్నారు. తనకు ఎలాంటి పాత్ర అన్నది ముఖ్యం కాదని, నటనకు అవకాశం ఉంటే ఏ తరహా పాత్రనైనా చేయడానికి రెడీ అని, అది ప్రతినాయకి పాత్ర అయినా నటిస్తానని చెప్పారు. ఇటీవల ఈ భామ యువ సంగీత దర్శకుడు సాయి అభయంకర్‌తో కలిసి నటించిన ఇండిపెండెంట్‌ మ్యూజికల్‌ ఆల్బమ్‌ ఇప్పుడు యూట్యూబ్‌ ఛానళ్లలో వైరల్‌ అవుతోంది.

నటి భాగ్యశ్రీ బోర్సే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement