తమిళ సినిమా: నాన్ ఈ చిత్రం సక్సెస్‌తో టాలీవుడ్ స్టార్ హీరో నానికి తమిళంలోనూ మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఏర్పడింది. ఆ తరువాత ఈయన నటించిన చాలా చిత్రాలు అనువాదమై మంచి ఆదరణను పొందుతున్నాయి. తాజాగా నాని కథా నాయకుడిగా నటించిన ది ప్యారడైజ్ చిత్రంపై హైఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. నటి కయాదు లోహర్ నాయకిగా నటించింది. ఇందులో నటి కీర్తి సురేష్ ప్రత్యేక పాటలో నటించారు. శ్రీకాంత్ ఓదెల కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందించారు. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో ఇంతకు రూపొందిన దసరా చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో ది ప్యారడైజ్ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 24న ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. తమిళంలో ఈ చిత్రాన్ని థింక్ స్టూడియోస్ సంస్థ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం చైన్నెలో మీడియాతో ముచ్చటించారు. కథా నాయకుడు నాని మాట్లాడుతూ ‘నేను మంచి నటుడినో కాదో తెలియదు కానీ మంచి ప్రేక్షకుడిని. అలా ఇప్పటి వరకు ఒక కై ండాఫ్ మాస్ చూడాలని ఆశ. అలాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి చిత్రం ది ప్యారడైజ్. చిత్రం చూసిన తరువాత ఇది మీకూ అనిపిస్తుంది. ది ప్యారడైజ్ చిత్రం నాకు చాలా ప్రత్యేకం. అదేవిధంగా స్టోరీ చెప్పిన విధానం, స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో కూడిన థియేటరికల్ మూమెంట్‌ను కలిగించే చిత్రం. అంతకు మించిన విషయం ఒకటి ఇందులో ఉంది. ఇప్పటి వరకు నన్ను నాని అని పిలిచిన మీరు ఈ చిత్రం విడుదలైన తర్వాత జడల్ అని పిలుస్తారు. ఇకపోతే తమిళ చిత్రాలు నాకు బైబిల్‌తో సమానం. నా సినిమా నాలెడ్జ్, నా తమిళ సినిమాలపై ఆసక్తికి, నా సినిమాపై ప్రేమకు స్పూర్తి నటుడు కమలహాసన్, మణిరత్నం, భారతి రాజా, కే.భాగ్యరాజ్ ఇలా చాలా మంది ప్రముఖులు ఉన్నారు. అంతే కాకుండా నాకు పర్సనల్‌గా కూడా చైన్నెతో మంచి కనెక్షన్ ఉంది. ఇక్కడ వెప్పన్ తదితర రెండు చిత్రాల్లో నటించాను. మంచి కథ, సందర్భం అదిరితే తమిళంలో నటించడానికి సిద్ధమే’ అని పేర్కొన్నారు.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాని, స్వరూప్ రెడ్డి


