తెన్కాసి వద్ద నది వంతెనపై ప్రభుత్వ బస్సు బోల్తా | - | Sakshi
Sakshi News home page

తెన్కాసి వద్ద నది వంతెనపై ప్రభుత్వ బస్సు బోల్తా

Sep 14 2026 3:32 AM | Updated on Sep 14 2026 3:32 AM

– 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

కొరుక్కుపేట: తెన్‌ కాశీ వద్ద తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ప్రభుత్వ బస్సు ఒకటి ఆదివారం ఉదయం 7 గంటలకు నైల్లె వైపు 30 మందికి పైగా ప్రయాణికులతో తెన్కాసి కొత్త బస్‌ స్టాండ్‌ నుండి బయలుదేరింది. అయ్యప్పరికి చెందిన శివశక్తి అనే డ్రైవర్‌ బస్సును నడుపుతున్నా డు. ఇసక్కిముత్తు ప్రయాణికులకు టిక్కెట్లు జారీ చేయడంలో నిమగ్నమై ఉన్నాడు. తెన్కాసిలోని ప్రధాన స్టేషన్ల వద్ద ప్రయాణికులను ఎక్కించుకు న్న తర్వాత, ఆ బస్సు వైట్టెకరన్‌ కులం గ్రామం స మీపంలోని అళుతకన్ని నది వంతెన వద్ద అదుపు తప్పి నదిలోకి తలకిందులుగా దూసుకుపోయింది. బస్సులోని ప్రయాణికుల కేకలు విన్న స్థానికు లు అంబులెన్స్‌, పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన 30 ప్రయాణికులను జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ప్రభుత్వ బస్సు డ్రైవర్‌ శివశక్తి, కండక్టర్‌ ఇసక్కిము త్తు కూడా ఉన్నారు. కాగా ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై కూర్తాలం పోలీస్‌ ఇన్‌స్పెక్టర్లు పచ్చై మాల్‌, రాబర్ట్‌ జైన్‌, సబ్‌–ఇన్‌స్పెక్టర్లు ముత్తు తిలకర్‌, చిన్నతురై, పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఉపఎన్నికల బరిలో

నామ్‌ తమిళర్‌ కట్చి

– అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సీమాన్‌

సాక్షి, చైన్నె: తమిళనాడు, పుదుచ్చేరిల్లో ఖాళీగా ఉ న్న శాసనసభ నియోజకవర్గాల ఉపఎన్నికలకు నా మ్‌ తమిళర్‌ కట్చి ఆదివారం సాయంత్రం తమ అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు పార్టీ ప్ర ధాన సమన్వయకర్త సీమాన్‌ తమ అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. మధురాంతకం– జానకీరామన్‌, ధారాపురం–కార్తిక, తట్టాంచావడి (పు దుచ్చేరి)– కార్తిక్‌ కుమారిలు పోటీ చేస్తారని వివరించారు. పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్త లు, శ్రేణులు అంతా అంకితభావంతో పనిచే యా లని సీమాన్‌ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

తమిళనాడు వ్యాప్తంగా 1.02 లక్షల కేసుల పరిష్కారం

– రూ. 982.18 కోట్ల నష్టపరిహారం మంజూరు

సాక్షి, చైన్నె : న్యాయస్థానాల్లో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించేందుకు తమిళనాడు వ్యాప్తంగా జాతీయ లోక్‌ అదాలత్‌ (ప్రజా కోర్టు) శనివారం నిర్వహించారు. తమిళనాడు రాష్ట్ర చట్టసేవల అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో పరిష్కరించిన కేసుల వివరాలను ఆదివా రం ప్రకటించార. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ. ధర్మాధికారి మార్గదర్శకత్వంలో, రాష్ట్ర చట్టసేవల సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఎస్‌ఎం. సుబ్రమణ్యం పర్యవేక్షణలో లోక్‌ అదాలత్‌లు జరిగాయి. మొత్తం పరిష్కారమై న కేసులు– 1,02,501గా ఉన్నాయి. మొత్తం సెటిల్‌మెంట్‌ రూ. 982.18 కోట్లుగా ఉండటం విశేషం. చైన్నె హైకోర్టు, మధురై బెంచ్‌ సహా జిల్లా స్థాయి కోర్టుల్లో మొత్తం 524 బెంచ్‌లుఈ విచారణ చే పట్టాయి. విచారించిన కేసులులలో మోటారు వా హన ప్రమాద నష్టపరిహారం, చెక్‌ బౌన్స్‌ కేసులు, సివిల్‌ వివాదాలు మొదలైనవి ఉన్నాయి. చైన్నె జి ల్లా ప్రధాన న్యాయమూర్తి పి. కార్తికేయన్‌ నాయకత్వంలో జరిగిన లోక్‌ అదాలత్‌లో మొత్తం విచారించిన కేసులు–17,840, పరిష్కారమైన కేసు లు–15,948, మంజూరైన నష్టపరిహారం: రూ.172.82 కోట్లుగా ఉన్నాయి. ఉభయ పక్షాల పరస్పర అంగీకారంతో రాజీ మార్గం ద్వారా ఈ కేసులన్నింటినీ ముగించినట్లు రాష్ట్ర చట్టసేవల అధికార సంస్థ సభ్య కార్యదర్శి జస్టిస్‌ ఎస్‌. బాలకృష్ణన్‌ తెలిపారు.

2 వేల మెగావాట్ల

అదనపు విద్యుత్‌ కొనుగోలు

సాక్షి, చైన్నె : రాష్ట్రవ్యాప్తంగా నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరాను అందించేందుకు తమిళనాడు విద్యుత్‌ బోర్డు అదనంగా 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్‌ కొరత లేదని బోర్డు ప్రకటించింది. విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీని ఉన్నతాధికారుల బృందం 24 గంటలూ పర్యవేక్షిస్తుండగా, క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నారని వివరించారు. ఫిర్యాదుల కోసం వినియోగదారులు 94987 94987 నంబర్‌లోని సేవా కేంద్రాన్ని సంప్రదించవచ్చని సూచించారు. కాగా, తమిళనాడు రాజధాని చైన్నెలో గత కొద్ది రోజులుగా విద్యుత్‌ డిమాండ్‌ నిరంతరం పెరుగుతోంది. పగటి , రాత్రి వేళల్లో విద్యుత్‌ వినియోగం తీవ్రస్థాయికి చేరడంతో రోజువారీ డిమాండ్‌ 4,600 మెగావాట్లకు పైగా నమోదవుతోంది. గత ఏడాదితో పోలిస్తే విద్యుత్‌ అవసరాలు గణనీయంగా పెరగడంతో బహిరంగ మార్కెట్‌ నుండి విద్యుత్‌ను కొనుగోలు చేయడం శాఖకు సవాలుగా మారింది. తాజాగా కొంత మేరకు కొనుగోలు చేసినా, చైన్నెలో పెరుగుతున్న గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ను తట్టుకోవడానికి చాలా కాలంగా మూతపడి ఉన్న బేసిన్‌ బ్రిడ్జ్‌ పవర్‌ స్టేషన్‌ను అత్యవసరంగా పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 120 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్‌లో మొదటి దశగా 60 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement