మూక్కుత్తిఅమ్మన్‌ 2పై నయన్‌ ఆసక్తి | - | Sakshi
Sakshi News home page

మూక్కుత్తిఅమ్మన్‌ 2పై నయన్‌ ఆసక్తి

Sep 14 2026 3:32 AM | Updated on Sep 14 2026 3:32 AM

తమిళసినిమా: ఇంతకు ముందు నటి నయనతార ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఆర్‌జే.బాలాజీ తెరకెక్కించిన సోషియల్‌ డివోషన్‌ కథా చిత్రం మూక్కుత్తి అమ్మన్‌. గత 2020లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. కాగా తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం మూక్తుత్తి అమ్మన్‌ 2. ఐసరి గణేశన్‌కు చెందిన వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ సంస్థ, నయనతారకు చెందిన రౌడీ పిక్చర్స్‌ సంస్థ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సుందర్‌.సీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులోనే టైటిల్‌ పాత్రను నటి నయనతార పోషిస్తున్నారు. నటి నటి స్నేహా, రెజీనా, ఊర్వశి, అభినయ,ఇనియ, మైనా నందిని, యోగిబాబు, దునియా విజయ్‌, రామచంద్రరాజు, అజయ్‌ గోష్‌, సింగంపులి, విచ్చు విశ్వనాథ్‌ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.దీనికి హిప్‌హాప్‌ తమిళా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంపై నటి నయనతార చాలా నమ్మకాన్ని పేట్టుకున్నారు. ఇటీ వల ఒక బేటీలో ఆమె పేర్కొంటూ మూక్కుత్తి అమ్మన్‌– 2 చిత్రం తన కెరీర్‌లో చాలా ముఖ్యమైన కథా చిత్రం అని, మైలు రాయిగా నిలిచిపోతుందనే నమ్మకాన్ని వ్యక్తిం చేశారు. చిత్రంలో భావోద్రేకాలతో కూడిన పలు ఆశ్చర్యకరమైన అంశాలు చోటు చేసుకున్నాయని పూర్కొన్నారు. దీంతో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. కాగా ఈ చిత్రంలోని మహాశక్తి అనే పల్లవితో సాగే పాటను వినాయక చవితి సందర్భంగా సోమవారం విడుదల చేయనున్నట్లు వేల్స్‌ ఫలిం ఇంటర్నేషనల్‌ సంస్థ అధినేత ఐసరిగణేశన్‌ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. కాగా షూ టింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దీపావళి సందర్శంగా విడుదల కు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

మూక్తుత్తి

అమ్మన్‌ –2

చిత్రంలో

నయనతార

తమిళసినిమా: సెలెక్టీవ్‌ కథా చిత్రాలను చేస్తున్న యువ నటుడు గౌతమ్‌ రామ్‌ కార్తీక్‌. ఈయన తాజాగా హీరోగా నటించిన చిత్రం బ్లడి పాలిటిక్స్‌. దర్శకుడు గణేశ్‌ కే.బాబుకు చెందిన డ్రాప్ట్‌ బై జీకేబీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీ.ముత్తుకుమార్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దిన రాఘవన్‌ కథా, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలో నటి అర్చన నేత్రన్‌ నాయకిగా నటిస్తున్నారు. కాగా దీనికి దర్శకుడు రాజు మురుగన్‌ మాటలు రాయడం విశేషం. కాగా శ్యామ్‌.సీఎస్‌ సంగీతాన్ని, ప్రదీప్‌ కలిరాజా ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ఇటీవల విడుదల చేయగా చిత్రంపై ఆసక్తిని పెంచినట్లు యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు. కాగా తాజాగా చిత్ర టీజర్‌ను నటుడు విజయ్‌సేతుపతి తన ఎక్స్‌ మీడియాలో విడుదల చేసినట్లు చెప్పారు. పక్కా రాజకీయ నేపథ్యంతో సాగే ఈ టీజర్‌లో నటుడు గౌతమ్‌ రామ్‌ కార్తీక్‌తో పాటు దర్శకుడు పీ.వాసు, సెల్వరాఘవన్‌ నటించిన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని, ఇది నటుడు గౌతమ్‌ రామ్‌ కార్తీక్‌ కెరీర్‌లో ముఖ్య చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకాన్ని యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఆసక్తి కలిగిన యువకుడి జీవితంలో జరిగే పరిణామాలేంటన్న ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిస్తున్న చిత్రం ఇదన్నారు. కాగా చిత్ర ఆడియో, ట్రైలర్‌ విడుదల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు.

బ్లడి పాలిటిక్స్‌

టీజర్‌ విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement