మార్గంమధ్యలో ఆగిన ప్రభుత్వ బస్సు | - | Sakshi
Sakshi News home page

మార్గంమధ్యలో ఆగిన ప్రభుత్వ బస్సు

Sep 14 2026 3:32 AM | Updated on Sep 14 2026 3:32 AM

●ప్రయాణికుల ఇక్కట్లు

తిరుత్తణి: సీఈజీ గ్యాస్‌ ఖాళీతో ప్రభుత్వ బస్సు రాత్రి సమయంలో మార్గంమధ్యలో ఆగడంతో ప్రయాణికులు ఇబ్బందులు చెందారు. కాలుష్యం అరికట్టి, డీజిల్‌ ఖర్చు పొదుపు చేసే విధంగా ప్రభుత్వ బస్సులకు సీఈజీ గ్యాస్‌ ద్వారా బస్సులు నడుపుతున్నారు. ఈక్రమంలో తిరువళ్లూరు ప్రభుత్వ బస్సు డిపోకు చెందిన రూట్‌ నెంబర్‌ 97 బస్సు శనివారం రాత్రి తిరువళ్లూరు నుంచి తిరుత్తణికి వెళ్లింది. ఆ బస్సులో 40 మంది ప్రయాణికులు ప్రయాణం చేసారు. చైన్నె తిరుపతి జాతీయ రహదారిలో తిరుత్తణి శివారు కాశినాధపురం వద్ద బస్సు చేరుకుగా మార్గ మధ్యలో ఆకస్మాత్తుగా బస్సు ఆగిపోయింది. డ్రైవర్‌ను విచారించగా బస్సు లో గ్యాస్‌ ఖాళీ కావడంతో ఆగిపోయినట్లు తిరువళ్లూరుకు వెళ్లి గ్యాస్‌ నింపితే తప్పా బస్సు కదలదని చెప్పి ప్రయాణికులను దింపేశారు. రాత్రి సమయంలో మహిళా ప్రయాణికులతో పాటు 40 మంది రోడ్డులో వేచివుండి తిరుత్తణికి వెళ్తున్న మరో బస్సులో ఎక్కించి పంపారు. అనంతరం రాత్రి 12 గంటల సమయంలో మరో బస్సును తీసుకొచ్చి తాడుకట్టి గ్యాస్‌ లేకుండా ఆగిపోయిన బస్సును తిరువళ్లూరుకు తీసుకెళ్లారు. గ్యాస్‌ బస్సుల ను ముందస్తుగా గ్యాస్‌ స్టాక్‌ పరిశీలించి బస్సులు నడపాలని ప్రయాణికులు ప్రభుత్వానికి కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement